శృంగారం శృతి మించలేదు  

Jyothi Lakshmi A Family Entertainer -

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో ఛార్మింగ్‌ ఛార్మి హీరోయిన్‌గా తెరకెక్కిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ సినిమా ట్రైలర్స్‌ మరియు పోస్టర్స్‌ చూస్తుంటే ఈ సినిమాను ఫ్యామిలీ ప్రేక్షకులు చూడటం కష్టంగా అనిపిస్తోంది.

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

TeluguStop.com - Jyothi Lakshmi A Family Entertainer-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ సినిమా కేవలం యూత్‌ ఆడియన్స్‌ మాత్రమే అనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతోంది.దాంతో చిత్ర యూనిట్‌ జాగ్రత్త పడి ఈ సినిమాపై ఒక క్లారిటీని ప్రేక్షకుల్లో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇది కేవలం యూత్‌ ఆడియన్స్‌కు మాత్రమే కాదని, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చెబుతున్నారు.తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడమే కాక ఒక నిర్మాత కూడా అయినా ఛార్మి మాట్లాడుతూ.

ఈ సినిమాలో ‘జ్యోతిలక్ష్మి’ ఒక వేశ్యే.కాని ఇందులో రొమాంటిక్‌ సీన్స్‌ ఎక్కువగా ఉండవని, శృతిమించిన శృంగారం ఈ సినిమాలో ఉండదని చెప్పుకొచ్చింది.

***

చిన్న పిల్లలతో పాటు కూడా ఈ సినిమా చూడవచ్చని ఈమె చెప్పుకొచ్చింది.ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు ‘యూ/ఎ’ సర్టిఫికెట్‌ను ఇచ్చిన విషయాన్ని ఈమె గుర్తు చేస్తోంది.

ఈమె ఎంతగా అరిచి చెప్పినా కాని ఈ సినిమాపై ఆ సినిమా అనే ముద్ర పడటంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ రావడం కష్టమే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jyothi Lakshmi A Family Entertainer Related Telugu News,Photos/Pics,Images..