ఆ హీరోతో రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చిన బ్యాడ్మింటన్‌ స్టార్  

Jwala Gutta And Vishnu Vishal Romantic Photo Turns Viral - Telugu Jwala Gutta And Vishnu Vishal, Kollywood, Romantic Photo Turns Viral, Tollywood

ఇండియన్ బ్యాడ్మింటన్‌ స్టార్ గుత్తాజ్వాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బ్యాడ్మింటన్‌ రాణించి ఇండియాకి పతకాలు తీసుకొచ్చిన ఈమె ఈ మధ్య కాలంలో ఆటలో కంటే తన రిలేషన్స్ విషయంలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతున్నారు.

Jwala Gutta And Vishnu Vishal Romantic Photo Turns Viral

లైఫ్ స్టైల్ పార్టీ కల్చర్ కి దగ్గరగా ఉండే గుత్తాజ్వాల 2011 తన బ్యాడ్మింటన్‌ ఆటగాడు చేతన్ ఆనంద్ ని పెళ్లి చేసుకొని కొద్ది కాలానికి విడిపోయింది.ఆ తర్వాత ఈమె చాలా మందితో రిలేషన్ లో ఉన్నట్లు టాక్ వచ్చింది.

అయితే ఆమె చుట్టూ అల్లుకున్న కథలకి చాలా సందర్భాలలో ఆమె ఫుల్ స్టాప్ పెట్టింది.టాలీవుడ్ సెలబ్రిటీలతో ఎక్కువగా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉండే గుత్తాజ్వాల ఈ మధ్యకాలంలో మరోసారి వార్తలలోకి వచ్చింది.

తమిళ నటుడు విష్ణు విశాల్ తో గుత్తా జ్వాల కొంతకాలంగా ప్రేమలో ఉందనే వార్తలు వస్తూ ఉన్నాయి.పలు సందర్భాలలో లేట్ నైట్ పార్టీలలో వారిద్దరు కలిసి కనిపించడం, పుట్టినరోజు వేడుకలు కలిసి సెలబ్రేట్ చేసుకోవడంతో ఈ వార్తలకి మరింత బలం వచ్చింది.

అయితే వారి రిలేషన్ పై ఇన్ని రోజులు గోప్యంగా ఉంచిన ఇద్దరు తాజాగా వేలెంటైన్స్ డే రోజు ఓపెన్ అప్ అయిపోయారు.వేలంటైన్స్‌ డే రోజున విష్ణు విశాల్‌కు ముద్దిస్తున్న ఫొటోను గుత్తా జ్వాల పోస్ట్‌ చేసి ఇతడే నా వేలంటైన్‌ అని రాశారు.

దీంతో ఇద్దరు ప్రేమలో ఉననరనే విషయం అందరికి క్లారిటీ వచ్చేసింది.అయితే ఈ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్తారా లేక మధ్యలో డ్రాప్ అయిపోతారా అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు