బిగ్ బాస్ లో నేను చేయడం లేదు అంటున్న బ్యాట్మెంటన్ స్టార్  

బిగ్ బాస్ లో చేయడం లేదు అంటున్న గుత్తా జ్వాల. .

Jwala Gutta Opens Up On Bigg Boss 3-jwala Gutta Opens Up,telugu Cinema,tollywood

బిగ్ బాస్ సీజన్ 3కి సంబంధించి తెలుగు రాష్ట్రాలలో గత కొద్ది రోజులుగా ఆసక్తికర వాఖ్యలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ 3 షోకి వాఖ్యతగా నాగార్జున వ్యవహరిస్తున్నారని, ఇక ఈ సీజన్ లో టాలీవుడ్ నుంచి ప్రముఖ యాంకర్స్ తో పాటు చాలా మంది సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ కామెంట్స్ లో వాస్తవాలు ఎంత అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 3లో ప్రముఖ బ్యాట్మెంట్ ప్లేయర్ గుత్తా జ్వాల కూడా పాల్గోనబోతుందని టాక్ వినిపించింది. .

బిగ్ బాస్ లో నేను చేయడం లేదు అంటున్న బ్యాట్మెంటన్ స్టార్ -Jwala Gutta Opens Up On Bigg Boss 3

తాజాగా టాలీవుడ్ సర్కిల్ లో వైరల్ అవుతున్న ఈ వాఖ్యలపై గుత్తాజ్వాల స్పందించింది. తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని తేల్చి పారేసింది.

అయితే దీనిపై ఆమె వివరణ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో ఆసక్తికరమైన కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. గుత్తాజ్వాలని సంప్రదించిన మాట వాస్తవమే కాని ఆమె ఎక్కువగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెని పక్కన పెట్టారని, ఆమె స్థానంలో మరొక వ్యక్తిని తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై గుత్తా జ్వాల ఎలాంటి కామెంట్స్ చేస్తుంది అనేది వేచి చూడాలి.