విష్ణు విశాల్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన గుత్తా జ్వాల

కోలీవుడ్ యువ హీరో విష్ణు విశాల్ తో బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల చాలా కాలంగా డేటింగ్ లో ఉంది.ఈ మధ్యనే నిశ్చితార్ధం చేసుకున్న సంగతి తెలిసిందే.

 Jwala Gutta Clarity About Marriage With Vishnu Vishal, Kollywood, Badminton Star-TeluguStop.com

విష్ణు హీరోగా సక్సెస్ అయ్యే ప్రయత్నంలో ఉంటే గుత్తా కోచ్ గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే కసితో ఉంది.వీరిద్దరికి ఇది రెండో నిశ్చితార్ధమే.

గతంలో వీరికి పెళ్లిళ్లు అయ్యి తమ భాగస్వామితో విడాకులు కూడా తీసుకున్నారు.ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన వీరి రిలేషన్ గురించి తాజాగా గుత్తా జ్వాల ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

తామిద్దరికీ తమ కెరీర్ అంటే ప్రాణమని, కెరీర్ పై ఉన్న అనురక్తే తామిద్దరినీ కలిపిందని వివరించారు.తాను ప్రస్తుతం బ్యాడ్మింటన్ అకాడమీ స్థాపించి, దాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నానని, విష్ణు విశాల్ చిత్రరంగంలో ఉన్నతస్థాయికి ఎదగాలని పరితపిస్తున్నాడని జ్వాల తెలిపారు.

Telugu Badminton, Jwala Gutta, Kollywood, Tollywood, Vishnu Vishal-Latest News -

ఇప్పటికే రచ్చసన్ లాంటి సినిమాతో విష్ణు సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడని, ప్రస్తుతం తామిద్దరం పూర్తిగా కెరియర్ మీద దృష్టి పెట్టడం జరిగిందని, ఈ సమయంలో అది తమకి ఎంతో కీలకమని గుత్తా పేర్కొంది.తాము ఒకరి అభిప్రాయాలని ఇంకొకరం గౌరవించుకుంటూ జర్నీ చేస్తున్నామని తెలిపింది.అలాగే తమ పెళ్లి గురించి చెబుతూ, ఇటీవల తమకు నిశ్చితార్థం అయిందని, పెళ్లి ఈ ఏడాది అయితే ఉండదని స్పష్టం చేసింది.అలాగే ఎప్పుడు పెళ్లి చేసుకుంటామనేది కచ్చితంగా అదరికి చెబుతామని కూడా క్లారిటీ ఇచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube