తప్పుడు ఆరోపణలు చేసిన మహిళలపై పరువునష్టం వేసిన జస్టిన్ బీబర్

పాప్‌ సంగీత ప్రపంచంలో చిన్న వయస్సులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న గాయకుడు ‌ జస్టిన్‌ బీబర్‌.ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కి బానిస అయ్యాడని, అలాగే మహిళలని లైంగిక వేధింపులకి గురి చేశాడు అంటూ అతనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగడంతో బీబర్ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయ్యింది.

 Justin Bieber Is Suing 2 Women In A Defamation Lawsuit, Hollywood, Bollywood, Po-TeluguStop.com

అయితే ఇప్పుడు తన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఇద్దరు మహిళలపై బీబర్ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు.తనపై ఆరోపణలు చేసిన ఒక్కో మహిళపై 75.6 కోట్లు పరువు నష్టం దావా వేశారు.తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా కల్పితమైనవని బీబర్‌ స్పష్టం చేశారు.

తాను ఆ మహిళలపై లైంగిక వేధింపులకి పాల్పడినట్లు చేసిన ఆరోపణలు నిరాధరమైనవని నిరూపించడానికి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నట్టు తెలిపారు.ఈ ఆరోపణలు చేసినవారిలో ఒకరు 2014లో అస్టిన్‌లో జరిగిన సౌత్‌వెస్ట్‌ ఫెస్టివల్‌ చూసేందుకు వచ్చిన సమయంలో బీబర్‌ తనపై దాడి చేసినట్టుగా చెప్పగా, మరో మహిళ న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన బీబర్‌ తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపించారు.

అయితే ఇవి పూర్తిగా అవాస్తవాలని బీబర్ స్పష్టం చేశాడు.ఇటువంటి ఆరోపణలు చేయడం ద్వారా ఇతరుల దృష్టిని ఆకర్షించాలనే కుట్ర దాగి ఉందని బీబర్‌ పేర్కొన్నారు.తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయ పోరాటం చేయనున్నట్టు బీబర్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube