జార్జ్‌ఫ్లాయిడ్‌కు న్యాయం జరిగింది: కోర్టు తీర్పుపై ప్రవాస భారతీయ సంఘాల హర్షం

అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో మిన్నియాపోలిస్ మంగళవారం సంచలన తీర్పును వెలువరించింది.ఫ్లాయిడ్ మరణానికి కారణమైన పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్‌ను దోషిగా తేలుస్తూ, త్వరలోనే శిక్ష ఖరారు చేయనుంది.

 Justice Served: Indian-american Politicians, Groups Welcome George Floyd Verdict-TeluguStop.com

కోర్టు తీర్పుపై ఫ్లాయిడ్ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ రోజు మేం మళ్లీ శ్వాస తీసుకోగలమని ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనైస్ భావోద్వేగానికి గురయ్యారు.

అటు ఫ్లాయిడ్ మద్ధతుదారులు కూడా రోడ్ల మీదకు వచ్చి ‘‘న్యాయం గెలిచిందంటూ’’ ఫ్లకార్డులు ప్రదర్శించారు.అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.

అటు అమెరికాలో స్థిరపడిన భారత సంతతి ప్రజలు, భారతీయ సంఘాలు కూడా కోర్టు తీర్పును స్వాగతించాయి.ఈ రోజు న్యాయం జరిగిందని.కానీ డెరెక్ చౌవిన్‌ను దోషిగా తేల్చడం వల్ల నల్లజాతి జీవితాను భయభ్రాంతులకు గురిచేసి చంపే వ్యవస్థలో మార్పు రాలేదని భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ అన్నారు.జస్టిస్ ఇన్ పోలీసింగ్ చట్టాన్ని ఆమోదించడం ద్వారా నల్లజాతీయుల కోసం పోరాడుతూనే వుంటామని ఆమె చెప్పారు.

మరో కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా మాట్లాడుతూ.ఈ తీర్పు జవాబుదారీతనాన్ని తెచ్చిందని వ్యాఖ్యానించారు.

కానీ జార్జ్‌ఫ్లాయిడ్ నేటికీ సజీవంగా లేరనే వాస్తవాన్ని మాత్రం మార్చదని.ఇప్పుడు జస్టిస్ ఇన్ పోలీసింగ్ చట్టాన్ని ఆమోదించాలని ఖన్నా వ్యాఖ్యానించారు.

వీరితో పాటు అమీ బేరా, సెంటర్ ఫర్ అమెరికన్ ప్రొగ్రెస్ అధ్యక్షురాలు నీరా టాండన్ తదితరులు కోర్ట్ తీర్పుపై హర్షం వ్యక్తం చేయడంతో పాటు జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

అమెరికాలోని మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే ఓ నల్ల జాతి వ్యక్తి పోలీసులు అరెస్టు చేస్తుండగా చనిపోయిన సంగతి తెలిసిందే.2020 మే 25న జరిగిన ఈ ఘటన కారణంగా అమెరికాలోని అనేక నగరాలు రగిలిపోయాయి.ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెడపై గట్టిగా నొక్కిపట్టడంతో అతని ఊపిరాడక మరణించాడు.

తనకు ఊపిరాడటం లేదని ఫ్లాయిడ్‌ అరుస్తున్నా పట్టించుకోకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరించినట్లు వైరల్ అయిన వీడియోలలో ఉంది.ఈ క్రమంలో జార్జ్‌ఫ్లాయిడ్ ఆక్సిజన్ అందకే మరణించాడని వైద్యుడు తెలిపారు.

వివాదాస్పద పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ మోకాలు అతని మెడపై ఉండటం వల్ల అతను ఊపిరి ఆడక ప్రాణాలు వదిలాడని ఆయన వాంగ్మూలం ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube