ప్రణయ్ ఆశయాన్ని నెరవేర్చడం కోసం పోరాటం మొదలుపెట్టిన 'అమృత'.! సపోర్ట్ చేయాలంటే ఇలా.?  

Justice For Pranay Amrutha Starts Social Media Campaign For Pranay-

ప్రణయ్ అమృత ల లవ్ స్టోరీ తెలుగు రాష్ట్ర ప్రజలను ఎంత కన్నీళ్లు పెట్టించిందో అందరికి తెలిసిందే.ప్రణయ్ హ‌త్య‌పై పోరాటం ప్రారంభించారు అమృత.ప్రణయ్‌ని చంపిన వాళ్లను శిక్షించటానికి, పుట్టబోయే బేబీని పెంచి పెద్ద చేస్తానని చెప్పారు..

Justice For Pranay Amrutha Starts Social Media Campaign For Pranay--Justice For Pranay Amrutha Starts Social Media Campaign Pranay-

అంతేకాదు ప్రణయ్ ఆశయాన్ని నెరవేరుస్తా అన్నారు.కుల రహిత సమాజం నిర్మించడం ప్రణయ్ ఆశయం.దానికోసం ఇప్పుడు అమృత సోషల్ మీడియా వేదికగా పోరాటం మొదలుపెట్టారు.

‘జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్‌’ పేరిట ఫేస్‌బుక్‌ పేజీ క్రియేట్‌ చేశారు.ఫేస్ బుక్ పేజీ ప్రారంభించిన తొలి ఐదు గంటల్లోనే పదివేల మంది పేజీని లైక్ చేశారు.ప్రణయ్ విషయంలో న్యాయం జరగాలంటూ కామెంట్ పోస్ట్ చేశారు.కుల పిచ్చి పట్టిన మారుతీరావు.

పరువు కోసం ప్రణయ్‌ను దారుణంగా చంపేశాడని.అతన్ని.హత్య కుట్రలో పాల్గొన్న అందరినీ కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో ఇప్పటికే జనం డిమాండ్‌ చేస్తున్నారు..

ఇపుడు జస్టిస్ ఫర్ ప్రణయ్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ అయిపోయింది.ఈ డిమాండ్ కు జనం మద్దతు పెరుగుతోంది.మీరూ ఆ పేజిని లైక్ చేయండి.

ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.