ఈ వీడియో చూస్తే చాలు.. బద్ధకం అసలు మీ దరిచేరదని అంటున్న ఆనంద్ మహీంద్ర..!

ప్రముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మహీంద్రా నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే.‘మండే మోటివేషన్’ పేరిట ఆయన ఇన్‌స్పైరింగ్ వీడియోస్ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తుండటాన్ని మనం గమనించొచ్చు.

 Just Watch This Video Anand Mahindra Says That Laziness Does Not Reach You-TeluguStop.com

అయితే, ఆయన కేవలం మండేస్‌లోనే కాదు 24/7 ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేస్తూనే ఉంటారు.అవి చూసి నెటిజనాలు ఆయన్ను తెగపొగిడేయడంతో పాటు వీడియోలు, లేదా ఇంట్రెస్టింగ్ పోస్టుల పట్ల రకరకాల కామెంట్స్ చేస్తుంటారు.

తాజాగా ఆయన షేర్ చేసిన ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.ఇంతకీ అందులో ఏముందంటే

 Just Watch This Video Anand Mahindra Says That Laziness Does Not Reach You-ఈ వీడియో చూస్తే చాలు.. బద్ధకం అసలు మీ దరిచేరదని అంటున్న ఆనంద్ మహీంద్ర..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మనలో చాలా మంది వీక్ మొత్తం బిజీగా ఉన్నందున సండే రోజున రెస్ట్ తీసుకుందాం అని ప్లాన్ చేసుకోవడం కామనే కదా ఈ నేపథ్యంలో తాను కూడా ఆ బాపతు పర్సనే అని చెప్తూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశాడు.

ఆ వీడియో చూస్తే చాలు.మీరు కూడా తప్పకుండా అలసిపోతారు అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశాడు.

అయితే, చాలా మంది వీక్ డేస్ మొత్తం ఎక్సర్‌సైజెస్ చేసినా సండే వచ్చేసరికి తప్పిస్తూ ఉంటారు.కాగా, ఆయన షేర్ చేసిన వీడియోలో జిమ్నాస్ట్‌లు డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫీట్స్ చేస్తున్నారు.

ఆ విన్యాసాలు చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.కాగా, తానూ ఆ కేటగిరీకే చెందిన వాడినేననంటూ ఫన్నీ కామెంట్ చేశాడు మహీంద్రా.

ఈ క్రమంలోనే ఆదివారం రోజున నీరసంగా ఉండేవాళ్లలో శక్తిని నింపేందుకు ఓ పరిష్కారం ఉందని చెప్పాడు మహీంద్రా.అదేంటంటే తాను ఎలాగైతే సదరు వీడియోని సేవ్‌ చేసుకున్నానో, మీరు సేవ్‌ చేసుకోండి.సేవ్‌ చేసుకోవడమే కాదు.కనీసం ప్రతీ రోజు రెండు సార్లు ఈ వీడియో చూడాలని సూచించాడు.అలా చేయడం వల్ల బాడీలోని ప్రతీ పార్ట్‌కు ఎక్సర్‌సైజ్ అవుతుందని పేర్కొన్నాడు ఆనంద్ మహీంద్రా.ఈ వీడియో చూసి నెటిజనాలు మహీంద్రాను మెచ్చుకుంటున్నారు.

ఇలాంటి వీడియోలు మీకు మాత్రమే దొరకుతాయని కామెంట్స్ చేస్తున్నారు.

#Bussiness Man #Sunday #For Good Health #Anand Mahindra #AnandMahindra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు