జస్ట్, పార్కింగ్ ప్లేస్ అద్దెకిస్తూ రూ.7 లక్షలు సంపాదించిన యువకుడు.. ఎక్కడంటే..?

Just, The Young Man Who Earned Rs. 7 Lakhs By Renting A Parking Place Where Is He, Renting Parking Spaces, Extra Income, London, YourParkingSpace, Viral News, Creative Business Ideas, Alessandro Rossi, Dalston, London

ఈ రోజుల్లో సిటీలో ఎక్స్‌ట్రా కొత్త భూమి ఉంటే చాలు దానిని రెంట్‌కి లేదా లీజుకి ఇస్తూ హాయిగా బతికేయొచ్చు.అయితే తాజాగా ఒక వ్యక్తి కేవలం తన పార్కింగ్ ప్లేస్ అద్దెకిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు.

 Just, The Young Man Who Earned Rs. 7 Lakhs By Renting A Parking Place Where Is H-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.అలెశాండ్రో రోస్సీ అనే బ్యాంకు ఉద్యోగి తూర్పు లండన్‌లోని డాల్‌స్టన్‌లోని ఒక ఇంట్లో ఉంటున్నాడు.ఈ యువకుడు తన ఇంటిలో ఉపయోగించని రెండు పార్కింగ్ స్థలాలను అద్దెకు ఇవ్వడం ద్వారా ఏకంగా £7,000 (దాదాపు రూ.7,06,992) సంపాదించాడు.అతను ఈ ఎక్స్‌ట్రా డబ్బు సంపాదించడానికి ఆరు సంవత్సరాల క్రితం తన పార్కింగ్ ప్లేస్‌లకు అద్దెకు ఇవ్వడం ప్రారంభించాడు.

Telugu Creative Ideas, Dalston, Extra, London-Latest News - Telugu

అతను ప్రతి పార్కింగ్ ప్లేస్‌కు నెలకు £100 (సుమారు రూ.10,100) వసూలు చేస్తాడు. యూరోపియన్ హాలిడేస్ లో ఎంజాయ్ చేయడానికి ఈ డబ్బులను అతడు ఉపయోగించుకున్నాడు.అలెశాండ్రోకి కారు లేదు.తనకు కారు లేనందున తన పార్కింగ్ ప్లేస్‌లు ఖాళీగా ఉంటున్నాయని.అలా ఖాళీగా ఉంచడం బదులుగా కొంత డబ్బు సంపాదించవచ్చని అతడు ఐడియా చేశాడు.

ఆ ఐడియానే అతనికి లక్షల కురిపించింది.

Telugu Creative Ideas, Dalston, Extra, London-Latest News - Telugu

అలెశాండ్రో “YourParkingSpace” అనే వెబ్‌సైట్‌ని మంత్లీ పార్కింగ్ ప్లేస్ లు అద్దెకు ఇవ్వడానికి ఉపయోగిస్తాడు.ఆ డబ్బును యూరోపియన్ సెలవులకు చెల్లించడానికి, తన ఫ్లాట్‌ల కోసం సర్వీస్ ఛార్జీని చెల్లించడానికి ఉపయోగిస్తాడు.ఇతరులకు కూడా ఖాళీగా పార్కింగ్ స్థలం ఉంటే తనలాగే దానిని రెంట్‌కి ఇచ్చి డబ్బులు సంపాదించాల్సిందిగా ఇతడు సూచిస్తున్నాడు.నెటిజన్లు అతడికి తట్టిన ఐడియాని బాగా పొగుడుతున్నారు.

ఇకపోతే ఇంగ్లాండ్‌, అమెరికా వంటి దేశాల్లో పార్కింగ్ కోసమే ప్రజలు చాలా డబ్బులు చెల్లిస్తుంటారు.ఈ ప్రాంతాల్లో ఖాళీగా పార్కింగ్ స్థలాలు ఉన్నవారు పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకోవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube