పెళ్లి జరిగిన కొన్ని నిమిషాలకే విడాకులు తీసుకున్నారు... ఎందుకో తెలిస్తే, పెళ్లి కొడుకును చెప్పుతో కొట్టినా తప్పులేదంటారు

పెళ్లి అంటే నూరేళ్ల పంట, రెండు కుటుంబాలను ఏకం చేసే ఒక తంతు.రెండు జీవితాలకు కొత్త అర్థంను ఇచ్చే పెళ్లికి భారతీయ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

 Just Married And Just Divorced-TeluguStop.com

కేవలం భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచంలోని అంతా కూడా పెళ్లి అంటే ఒక గౌరవం ఇస్తారు.పెళ్లి చేసుకున్నారు అంటే చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా సర్దుకు పోతూ ఉంటారు.

కొందరి సంసారాల్లో పెద్ద పెద్ద గొడవలు కూడా వస్తూ ఉంటాయి.అయినా కూడా వారు సర్దుకు పోతూ ఉంటారు.

పెళ్లి అనేది రెండు జీవితాలను కలుపుతుంది.దాన్ని చిన్న చిన్న గొడవల వల్ల విడదీసుకోవద్దు అనేది పెద్దల అభిప్రాయం.

చిల్లర విషయాలను, చిన్న విషయాలకు విడాకులు తీసుకున్న వారిని మనం చూశాం.కాని తిండి విషయంలో విడాకులు తీసుకున్న వారిని మాత్రం మనం చూడలేదు.మీరేమో కాని, నేనైతే ఎప్పుడు చూడలేదు.అది కూడా పెళ్లి అయిన కొన్ని నిమిషాలకే తిండి విషయంలో విడాకులు తీసుకోవడం అనేది దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ జరిగి ఉండదు.

కాని మొదటి సారి ఈ దారుణమైన అవమానకర విషయం మన ఇండియాలో జరిగింది.ఈ సంఘటన మన ఇండియా పరువు తీసేదిగా ఉంది.

గుజరాత్‌లో జరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.ఈ పెళ్లి పెద్దలు మరియు పెళ్లి జంట ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టాలన్నంత కోపంగా ఉన్నారు.

గుజరాత్‌, రాజ్‌కోట్‌ జిల్లా గోండల్‌లో ఒక ఇంట్లో పెళ్లి హడావుడి కనిపిస్తుంది.పెళ్లి తంతు అంతా ముగిసింది.పెళ్లి తర్వాత రెండువైపుల బందువులు బోజనాలకు కూర్చున్నారు.బోజనాలు చేస్తున్న సమయంలో చిన్న వివాదం.అదే అబ్బాయి తరపు వారికి సరిగా బోజనం పెట్టడం లేదు అంటూ కొందరు గొడవ పెట్టడం ప్రారంభించారు.ఆ సమయంలోనే అమ్మాయి తరపు వారు అనుకున్న జనం కంటే ఎక్కువ వచ్చారు, దాంతో అన్నం నిండుకుంది.

ఇప్పుడు వండాలి అంటే సమయం పడుతుందని, దాన్ని సరి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

బోజనం కూడా పెట్టలేని వారు అంటూ అబ్బాయి తరపు బందువులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అమ్మాయి తరపు వారు కూడా రెచ్చి పోయారు.

దాంతో డైనింగ్‌ వద్ద గిన్నెలతో కొట్టేసుకున్నారు.అమ్మాయి, అబ్బాయి తరపు వారికి బాగా గాయాలు అయ్యాయి.ఇంత జరిగిన తర్వాత కలిసి ఉండటం మనం కష్టం అంటూ అబ్బాయి నాకు ఈ పెళ్లి వద్దన్నాడు.దాంతో అమ్మాయి తరపు వారు కూడా మేము కూడా మా అమ్మాయిని మీ ఇంటికి పంపం అంటూ చెప్పేశారు.

అలా ఇద్దరు కూడా పెళ్లి పందిరిలోనే విడాకులు తీసుకున్నారు.

అక్కడికి లాయర్లు రావడంతో పాటు, పెద్ద మనుషుల వద్ద సంతకాలు, ఇతర విడాకులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.మొత్తానికి వారిద్దరు కొన్ని నిమిషాలు మాత్రమే భార్యభర్తలుగా ఉన్నారు.ఈ విడాకులకు కారణం అయిన అబ్బాయి తరపు బందువులను మరియు అబ్బాయిని కూడా చెప్పుతో కొట్టినా తప్పులేదు అనిపిస్తుంది కదా.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube