దుబాయ్ లో పాస్ పోర్ట్ పోగొట్టుకుంటే ఇలా చేయండి చాలు...!!!

పాస్ పోర్ట్ విదేశీ ప్రయాణాలు చేసేవారికి ఇది ఆరోప్రాణం లాంటిది, విదేశాలలో ఉన్నప్పుడు పాస్ పోర్ట్ పొతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో నేరుగా ఆ పరిస్థితులను అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది.పాస్ పోర్ట్ పొతే ఆయా దేశాలు తమ దేశంలో ప్రయాణాలు చేసేందుకు గానీ ఉండేందుకు కానీ అనుమతులు ఇవ్వవు సరికదా సవాలక్ష ఆంక్షలు విధిస్తాయి.

 Just Do This If You Lose Your Passport In Dubai , Dubai, Dubai Police App, Government Of Dubai, Last Passport Certificate, Office Of Indian Origin-TeluguStop.com

ఈ నేపధ్యంలో దుబాయ్ దేశం తమ దేశంలో ప్రయాణాలు చేసే వారు ఒకవేళ పాస్ పోర్ట్ పోగొట్టుకుంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

దుబాయ్ ప్రభుత్వం తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.

 Just Do This If You Lose Your Passport In Dubai , Dubai, Dubai Police App, Government Of Dubai, Last Passport Certificate, Office Of Indian Origin-దుబాయ్ లో పాస్ పోర్ట్ పోగొట్టుకుంటే ఇలా చేయండి చాలు#8230;-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దుబాయ్ లో ప్రయాణీకులు ఇకపై పాస్ పోర్ట్ గనుకా పోగొట్టుకుంటే వారికి “లాస్ట్ పాస్ పోర్ట్ సర్టిఫికెట్” పేరుతో ఓ పత్రాన్ని అందిస్తారు.ఇది ప్రభుత్వంచే ఆమోదించబడి వస్తుంది.

దీని సాయంతో ప్రయాణీకులు ఎవరైనా సరే దుబాయ్ లో స్వేచ్చంగా ప్రయాణం చేయవచ్చు.అయితే.

పాస్ పోర్ట్ పోగొట్టుకున్న వెంటంటే ప్రయాణీకులు చేయాల్సిన పనేంటంటే.“లాస్ట్ పాస్ పోర్ట్ సర్టిఫికెట్” పొందాలనుకునే వారు మూడు విధాలుగా ఈ సర్టిఫికేట్ ను పొందవచ్చు.దుబాయ్ పోలీస్ యాప్ ద్వారా ఈ సర్టిఫికెట్ పొందవచ్చు లేదంటే దుబాయ్ లో ఉండే స్మార్ట్ పోలీస్ స్టేషన్ లేదా దుబాయ్ పోలీస్ అధికారిక వెబ్సైటు ద్వారా సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చును.కాగా పాస్ పోర్ట్ పోయిన వెంటంటే వెబ్సైటు నందు [పాస్ పోర్ట్ స్కాన్ కాపీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒక వేళ పాస్ పోర్ట్ కాపీ లేకపోతె దుబాయ్ లో ఉన్న భారత సంతతి కార్యాలయానికి వెళ్లి వారి నుంచీ కాపీ పొంది అప్లోడ్ చేయాలి.

ఈ సర్టిఫికేట్ పొందడానికి సుమారు 70 దిర్హమ్స్ ఖర్చు అవుతుంది.నేరుగా స్టేషన్ కి వెళ్లి చేసుకుంటే సుమారు 100 దిర్హామ్స్ ఖర్చు అవుతుంది.

ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలనుకునే వారు https://www.dubaipolice.gov.ae/wps/portal/home ఈ లింక్ క్లిక్ చేసి అందులో సమాచారం ప్రకారం అందించి సర్టిఫికేట్ పొందవచ్చు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube