ట్రాన్స్ జెండర్ గా మారిపోయిన ఆస్కార్ అవార్డు నటి

ఈ మధ్యకాలంలో జెండర్ ట్రాన్స్ ఫార్మ్ అనేది చాలా కామన్ అయిపోయింది.విదేశాలలో అయితే దీనిని చాలా చిన్న విషయంగా పరిగణిస్తారు.

 Juno Actor Elliot Page Comes Out As Transgender, Hollywood, Hollywood Celebritie-TeluguStop.com

అయితే గతంలో ఇండియాలో అయితే జెండర్ చేంజ్ అనేది ఏదో పెద్ద తప్పుగా భావించేవారు.ఈ కారణంగా చాలా మంది సమాజానికి భయపడి వారిలో వేరొక వ్యక్తిత్వం ఉన్న కూడా బయటకి వచ్చి చెప్పేవారు కాదు.

అలా ఎవరైనా వస్తే సమాజం నుంచి వెలి వేసేవారు.అయితే రోజులు మారాయి.

చట్టంలో కూడా మార్పులు వచ్చాయి.జెండర్ ట్రాన్స్ ఫార్మ్ అసలు తప్పుకాదని, అలాగే ఈక్వల్ జెండర్ పెళ్లిళ్లు కూడా తప్పుకాదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

దీంతో చాలా మంది బయటకి వచ్చి తాము గే అని, తాము లెస్బియన్ అని బహిరంగంగా ప్రకటించుకున్నారు.విదేశాలలో అయితే హాలీవుడ్ సెలబ్రెటీలు సైతం తమ జెండర్ గురించి సోషల్ మీడియా ద్వారా బయటకి చెప్పారు.

వాళ్ళ రిలేషన్ స్టేటస్ ని కూడా బయటపెట్టారు.

ఇప్పుడు హాలీవుడ్ లో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నటి, ఎక్స్ మెన్ లో కిట్టి ప్రైడ్ పాత్రలో మీరిన నటి ఎలియట్ పేజ్ తానొక ట్రాన్స్‌జెండ‌ర్‌నంటూ త‌న సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు.

ఎలియట్ పేజ్ ‌చేసిన ఈ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఇప్పుడు హాలీవుడ్ ఇండ‌స్ట్రీలో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.ట్రాన్స్‌జెండ‌ర్‌న‌ని చెప్పుకోవ‌డానికి త‌న‌కు ఇబ్బంది లేద‌ని, ఓ రకంగా గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని ఎలియట్ తెలిపారు.

ఈ జ‌ర్నీలో త‌న‌కు తోడుగా నిలిచిన ట్రాన్స్ క‌మ్యూనిటీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు ‌.ఇలా చెప్ప‌డం వ‌ల్ల తానేమీ ఫీల్ కావ‌డం లేద‌ని, ఇక‌పై త‌న‌కు న‌చ్చిన‌ట్లు ఉండే అవ‌కాశం దక్కిందని ఎలియట్ తెలిపారు.అదే సమయంలో ట్రాన్స్ జెండర్స్ కి సమాజంలో లభిస్తున్న ప్రాధాన్యత పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.ఇదిలా ఉంటే ఆమె ట్రాన్స్ జెండర్ గా మారడం వలన త్వరలో ఆమె నటించబోయే సినిమాలో ఆమె పాత్రలో ఎలాంటి మార్పులు ఉండవని సదరు నిర్మాతలు క్లారిటీ ఇవ్వడం ద్వారా ఎలియట్ పేజ్ నిర్ణయాన్ని స్వాగతించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube