మరీ పులితో ఎన్టీఆర్‌ ఫైట్‌ ఏంటి జక్కన్న?  

Juniour Ntr Fight With Tiger-jakkana Rajamouli,juniour Ntr,ramcharan Ntr,rrr

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతున్న విషయం తెల్సిందే.ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై మాత్రమే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.తదుపరి షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌తో పాటు రామ్‌ చరణ్‌ కూడా పాల్గొంటాడని తెలుస్తోంది.బల్గేరియాలని ఒక అడవిలో సినిమాకు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.కొమురం భీం అజ్ఞాతవాసం వెళ్లిన సమయంలో అతడు ఎదుర్కొన్న పరిస్థితులను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Juniour Ntr Fight With Tiger-jakkana Rajamouli,juniour Ntr,ramcharan Ntr,rrr Telugu Tollywood Movie Cinema Film Latest News Juniour Ntr Fight With Tiger-jakkana Rajamouli Juniour Ramcharan Rrr-Juniour NTR Fight With Tiger-Jakkana Rajamouli Juniour Ntr Ramcharan Rrr

Juniour Ntr Fight With Tiger-jakkana Rajamouli,juniour Ntr,ramcharan Ntr,rrr Telugu Tollywood Movie Cinema Film Latest News Juniour Ntr Fight With Tiger-jakkana Rajamouli Juniour Ramcharan Rrr-Juniour NTR Fight With Tiger-Jakkana Rajamouli Juniour Ntr Ramcharan Rrr

బల్గేరియాలోని అడవి ప్రాంతంలో ఒక ట్రైన్డ్‌ పులితో పోరాట సన్నివేశాలను ఎన్టీఆర్‌తో చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.చాలా సహజంగా వచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారట.అంతర్జాతీయ స్థాయి ఫైట్‌ మాస్టర్స్‌తో ఈ ఫైట్‌ను డిజైన్‌ చేయించారు.ఎన్టీఆర్‌ మరియు పులిల మద్య జరిగి భీకర పోరును ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారంటూ అప్పుడే ప్రచారం జరుగుతోంది.

జక్కన్న ఏం చేసినా కూడా అది అద్బుతంగా చేస్తాడు అంటున్నారు.మామూలుగా అయితే ఒక దర్శకుడు పులితో హీరోకు ఫైట్‌ పెడితే ఓవర్‌ అంటారు.కాని మా జక్కన్న పెడితే ఓవర్‌లా ఉండదని అభిమానులు అంటున్నారు.

జక్కన్న దేన్ని అయినా నమ్మించే శక్తి ఉన్న దర్శకుడు అంటూ సినీ విశ్లేషకుల అభిప్రాయం కూడా.కాని ఒక హీరో పులితో పోరాడటం అంటే మామూలు విషయం కాదు.దాన్ని జక్కన్న తీయడం కూడా ఆసక్తిగానే ఉంది.కొందరు మాత్రం మరీ పులితో ఎన్టీఆర్‌ పోరాటం ఏంటీ అంటూ ఎద్దేవ చేస్తున్నారు.

కొమురం భీం చరిత్రలో అసలు పులితో పోరాడిన సంఘటనలు లేనే లేవు.ఎందుకు మరీ అతి చేస్తున్నారు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.అసలు ఈ వార్త నిజమో కాదో తెలుసుకోకుండానే అప్పుడే కామెంట్స్‌ ఇష్టం వచ్చినట్లుగా చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు.చూద్దాం జక్కన్న నుండి ఎలాంటి అప్‌డేట్‌ వస్తుందో.!