ఒకప్పటి ఈ అల్లరి నరేష్ హీరోయిన్ అవకాశాలు లేక సీరియల్స్ లో...

ఒక్కోసారి కొంతమంది నటీనటులకి సినిమా ఇండస్ట్రీ కి రాగానే మంచి ఆరంభం లభించినప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల తెరమరుగైన నటీనటులు చలన చిత్ర పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.ఇందులో తెలుగులో 2002వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లరి నరేష్ హీరోగా నటించిన జూనియర్స్ చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ప్రముఖ హీరోయిన్ “శేరిన్ శృంగార్” కూడా ఈ కోవకే చెందుతుంది.

 Juniors Telugu Movie Fame Sherin Shringar Real Life And Cinema Career, Juniors T-TeluguStop.com

కాగా నటి శేరిన్ శృంగార్ కన్నడలో ప్రముఖ హీరో దర్శన్ హీరోగా నటించిన “ధ్రువ” అనే చిత్రం ద్వారా నటిగా పరిచయం అయింది.ఆ తర్వాత తమిళం, మలయాళం, కన్నడ, తదితర భాషలలో హీరోయిన్ గా నటించి కొంతకాలం పాటు బాగానే రాణించింది.

కానీ కానీ ఆ తర్వాత ఏమైందో ఏమోకానీ నటి శేరిన్ శృంగార్ తెలుగు చిత్రాలలో పెద్దగా నటించలేదు.దీనికితోడు ఇతర భాషలలో సినిమా ఆఫర్ల కోసం పలు తెలుగు చిత్రాల్లో నటించే అవకాశాలను వదులుకుంది.

దీంతో ఈ అమ్మడికి ఒకే సమయంలో దాదాపుగా ఐదుకి పైగా డిజాస్టర్లు ఎదుర్కొంది.దీంతో ఈ ప్రభావం ఈ అమ్మడి ఇ సినిమా కెరియర్ పై పడింది.

ఈ క్రమంలో కొంత కాలంపాటు సినిమా అవకాశాలు లేక ఇంటి పట్టునే గడిపింది.కానీ తన సినీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీరియళ్లలో నటించడానికి కూడా సిద్ధమైంది.

ఈ క్రమంలో దాదాపుగా 5కి పైగా చెప్పు ధారావాహికలలో నటించింది.

Telugu Allari Naresh, Juniors Telugu, Juniorstelugu, Sherin Shringar, Telugu Act

కాగా ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమాల పరంగా పెద్దగా ఆఫర్లు రాకపోయినప్పటికీ పలు డాన్స్ కాంపిటీషన్ షోలలో జడ్జ్ గా వ్యవహరిస్తూ ఏదో అలా రాణిస్తోంది.కాగా ఆ మధ్య తమిళ రియాలిటీ షో బిగ్ బాస్ షోలో గెస్ట్ గా పాల్గొని ప్రేక్షకులను బాగా అలరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube