చార్మినార్ లో షాపింగ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ భార్య.. సింప్లిసిటీకి ఫిదా అయ్యేలా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) భార్య లక్ష్మీప్రణతి( Lakshmi Pranathi ) సోషల్ మీడియాకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన విషయాలలో జోక్యం చేసుకోవడానికి ప్రణతి ఇష్టపడరు.

 Junior Ntr Wife Rare Pic Goes Viral In Social Media Details Here , Junior Ntr ,-TeluguStop.com

జూనియర్ ఎన్టీఆర్ కు ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా గుర్తింపు రాగా తారక్ కొత్త సినిమాలు సైతం ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.లక్ష్మీ ప్రణతి ఫ్యామిలీ ఈవెంట్స్ లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు.

లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడే లక్ష్మీ ప్రణతిని ఎంతోమంది అభిమానిస్తారు.అయితే లక్ష్మీ ప్రణతి తాజాగా చార్మినార్( Charminar ) దగ్గర షాపింగ్ చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం రంజాన్ మాసం అనే సంగతి తెలిసిందే.రంజాన్ మాసం కావడంతో హైదరాబాద్ కు క్యూ కడుతున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Telugu Charminar, Ntr, Ramadan, Bazaar, Ntrlakshmi-Movie

స్టార్ హీరో భార్య అయినప్పటికీ లక్ష్మీప్రణతి సింపుల్ గా నైట్ బజార్( Night Bazaar ) లో షాపింగ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.లక్ష్మీ ప్రణతి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి జోడీ బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ విషయానికి వస్తే తారక్ వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.

Telugu Charminar, Ntr, Ramadan, Bazaar, Ntrlakshmi-Movie

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ వస్తున్నాయి.కొరటాల శివ ఆచార్య ఫ్లాప్ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.కొరటాల శివ భిన్నమైన కథతో తారక్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ కు ఎదిగేలా స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నారు.ఎన్టీఆర్ యూత్ మెచ్చే కథలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube