ఆచార్య విషయంలో నిజమైన రాజమౌళి సెంటిమెంట్.. టెన్షన్లో తారక్?

సినిమా ఇండస్ట్రీలో రాజమౌళిని ఒక సెంటిమెంట్ వెంటాడుతోంది.ఆయన దర్శకత్వంలో నటించిన హీరోలకు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటారు.

 Junior Ntr Tension With Acharya Movie Details, Jr Ntr, Acharya Movie, Tollywood-TeluguStop.com

అయితే ఆ సినిమా తర్వాత ఆ హీరో నటించిన సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉండిపోయింది.ఈ క్రమంలోనే ఈ సెంటిమెంట్ ఇదివరకే అందరి హీరోల విషయంలో నిజమైంది.

ఈ క్రమంలోనే తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్.

ఈ క్రమంలోనే RRR సినిమా తర్వాత ఇద్దరు హీరోలు నటించే సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయి అంటూ పెద్దఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమాలో ఈ సెంటిమెంట్ వర్కవుట్ కాదని, రాజమౌళి పై ఉన్నటువంటి ఈ సెంటిమెంట్ నిజం కాదని ఆచార్య నిరూపిస్తుందని మెగాస్టార్ ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకలో వెల్లడించారు.అయితే ఈ సినిమాపై అంచనాలు ఉన్నప్పటికీ మెగా అభిమానులను మాత్రం రాజమౌళి సెంటిమెంట్ వెంటాడుతూనే వచ్చింది.

Telugu Acharya, Koratala Shiva, Jr Ntr, Chiranjeevi, Rajamouli, Ramcharan, Rrr,

అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి షో తోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.దీంతో ఆచార్య విషయంలో రాజమౌళి సెంటిమెంట్ వర్కౌట్ అయిందని అందరూ భావించారు.ఇక ఆచార్య సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తారక్ తన తదుపరి చిత్రం కొరటాల శివ సినిమా విషయంలో ఇదే సెంటిమెంట్ వర్కవుట్ అయితే కష్టమని తారక్ ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube