అల్లు అర్హ కంటే ముందు బాలనటులుగా ఎంట్రీ ఇచ్చింది వీళ్లే..?

బన్నీ స్నేహారెడ్డిల గారాలపట్టి అల్లు అర్హ సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అల్లు అర్హ చెప్పే డైలాగ్స్ అదిరిపోతాయని సినిమాకు అల్లు అర్హ పోషిస్తున్న ప్రిన్స్ భరత పాత్ర హైలెట్ కానుందని తెలుస్తోంది.

 Junior Ntr Sridevi Roja Ramani Debute Child Artist In Mythological Roles, Allu A-TeluguStop.com

అల్లు అర్హ పౌరాణిక పాత్రతో తన సినీ కెరీర్ ను మొదలుపెడుతూ ఉండటం గమనార్హం.అయితే పౌరాణిక పాత్రతో బాల నటులుగా ఎంట్రీ ఇచ్చి తర్వాత కాలంలో స్టార్ స్టేటస్ ను అందుకున్న సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు.

అల్లు అర్హ తొలి సినిమాలోనే అబ్బాయి పాత్రలో నటిస్తుండటం గమనార్హం.ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా గుర్తింపును సంపాదించుకుని నటుడిగా వెలుగు వెలుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో భరతుని పాత్రలో బాలనటుడిగా నటించి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

తొలి సినిమాతోనే నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఎన్టీఆర్ బాల రామాయణం సినిమాలో కూడా పౌరాణిక పాత్రలో నటించి మెప్పించారు.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి కూడా పౌరాణిక పాత్రలతోనే బాలనటిగా ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.తమిళంలో కాంధన్ కరునై అనే సినిమాలో తెలుగులో యశోద కృష్ణ సినిమాలో శ్రీదేవి బాలనటిగా నటించి మెప్పించడం గమనార్హం.

శ్రీదేవి పోషించిన రెండు పాత్రలు అబ్బాయే పాత్రలే కాగా ఆ పాత్రలతో శ్రీదేవికి నటిగా మంచి గుర్తింపు వచ్చింది.

Telugu Allu Arha, Debute, Ntr, Mythological, Roja Ramani, Sridevi-Movie

ప్రముఖ నటి రోజా రమణి భక్తప్రహ్లాద సినిమాలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహ్లాద పాత్రలో రోజారమణి జీవించారని చెప్పాలి.అల్లు అర్హ కూడా భవిష్యత్తులో ఈ నటుల్లా గొప్ప స్థాయికి ఎదుగుతారేమో చూడాల్సి ఉంది.2022లో శాకుంతలం మూవీ రిలీజ్ కానుండగా ఈ మూవీ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం ఎదురుచూస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube