స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్న ఎన్టీఆర్.. అంత ఆ సినిమా కోసమేనా?

సాధారణంగా ఒక సినిమాలో నటించే హీరో ఆ సినిమాలోని పాత్ర ఎలా డిమాండ్ చేస్తే అందుకు అనుగుణంగా తమ శరీరాకృతిని మార్చుకోవాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే కొందరు హీరోలు కొన్ని సినిమాలకు అధిక బరువు పెరిగినా.

 Junior Ntr Special Workout Plan In Koratala Siva-TeluguStop.com

మరికొన్ని సినిమాల కోసం బరువుతగ్గి శరీరం ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.ఇలా శరీర బరువును తగ్గించుకోవడం పెంచుకోవడం హీరోలకు సర్వసాధారణమే.

ఈ క్రమంలోనే తను నటించే సినిమాలలో పాత్రలు ఎలా డిమాండ్ చేస్తే అలా తయారయిపోతారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

 Junior Ntr Special Workout Plan In Koratala Siva-స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్న ఎన్టీఆర్.. అంత ఆ సినిమా కోసమేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Jr Ntr, Junior Ntr, Koratala Shiva, Movie News, New Look, Weight Loss-Movie

ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో తారక్ కొమురంభీమ్ పాత్రలో నటిస్తున్నారు.ఈ పాత్రకు అనుగుణంగా కాస్త శరీర బరువును పెంచినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా కేవలం ఒకే ఒక పాట పెండింగ్ ఉండటంతో ఆ పాట కోసం చిత్రబృందం ఉక్రెయిన్‌ వెళ్లారు.ఈ పాట పూర్తి కాగానే ఇందులో ఎన్టీఆర్ షూటింగ్ పూర్తి అవుతుంది.

ఇక ఈ సినిమా తర్వాత చరణ్ చేయబోయే సినిమా కోసం పూర్తిగా తన లుక్ చేంజ్ చేయాలని తెలుస్తుంది.

Telugu Jr Ntr, Junior Ntr, Koratala Shiva, Movie News, New Look, Weight Loss-Movie

రాజమౌళి సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ స్టైలిష్ పాత్రలో నటించడం వల్ల శరీర బరువు తగ్గాలని సూచించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన డైట్ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకొని స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

ఇదివరకే తారక్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన “జనతాగ్యారేజ్” సినిమాలో ఎన్టీఆర్ ఎంతో స్టైలిష్ గా కనిపించారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో కూడా అదేవిధంగా కనిపించబోతున్నట్లు సమాచారం.

#Jr NTR #NTR #Koratala Shiva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు