ఎన్టీఆర్‌ ఈసారి కూడా మౌనమే... ఇంత త్వరగా చెడిందా?  

  • ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చినా కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం స్పందించకుండా వదిలేశాడు. ఎన్టీఆర్‌ ఎందుకు బాలయ్య మూవీ గురించి మాట్లాడటం లేదు అంటూ అంతా అనుకున్నారు. కథానాయకుడు సినిమా సమయంలో సరే బిజీగా ఉన్నాడేమో అనుకున్నారు. కాని ఇప్పుడు మహానాయకుడు సినిమా వచ్చింది. షూటింగ్స్‌తో అంత బిజీగా కూడా ఏమీ లేడు. ఎన్టీఆర్‌ ఎందుకు మహానాయకుడు చూడలేదు అంటూ నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకు బాబాయి, అబ్బాయి మద్య అంతా బాగానే ఉందా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

  • హరికృష్ణ మరణంకు ముందు ఉప్పు, నిప్పులా ఉన్న బాబాయి, అబ్బాయిలు మరణంతో ఏకం అయ్యారు. ఆ సమయంలో నందమూరి అభిమానులకు కన్నుల పండుగ చేశారు. ఎన్టీఆర్‌ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్‌ కూడా హాజరు అయ్యాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కాని బాలయ్య బాబుతో మళ్లీ ఎన్టీఆర్‌ దూరంగా ఉంటున్నట్లుగా అనిపిస్తోంది. పార్టీ వ్యవహారాల విషయంలో ఎన్టీఆర్‌ ఆసక్తి చూపనప్పటికి బాలకృష్ణ టీడీపీకి అబ్బాయిని దూరంగా ఉంచాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ కారణంగా ఇద్దరి మద్య దూరం అయ్యిందా అనేది తెలియాల్సి ఉంది.

  • Junior Ntr Silence About NTR Mahanayakudu Movie-Director Krish Junior Mahanayakudu Movie Ntr Tdp

    Junior Ntr Silence About NTR Mahanayakudu Movie

  • కొన్ని రోజులు కూడా బాగున్నారో లేదో అప్పుడే ఈ విభేదాలు ఏంటీ అంటూ నందమూరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మద్య మరీ ఇంత త్వరగా విభేదాలు వస్తాయని ఊహించలేదని, అసలు నందమూరి హీరోలు ఎందుకు గొడవ పడ్డారు, ‘ఎన్టీఆర్‌’ సినిమా గురించి జూనియర్‌ ఎందుకు స్పందించడం లేదు అనే విషయమై ఇంకా కూడా క్లారిటీ రావడం లేదు. తాతగారి సినిమా గురించి ఎందుకు జూనియర్‌ స్పందించడం లేదా అంటూ అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. ఎన్టీఆర్‌ ఈ విషయమై నోరు తెరవాలని అంతా కోరుకుంటున్నారు.