మరో టాలీవుడ్ రికార్డును సొంతం చేసుకున్న ఎన్టీఆర్..?  

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.బాహుబలి, బాహుబలి 2 సినిమాల తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

TeluguStop.com - Junior Ntr Rrr Ramaraju For Bheem Teaser Bags Another Record

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రామరాజు ఫర్ భీమ్, భీమ్ ఫర్ రామరాజు టీజర్లు విడుదల కాగా ఈ రెండు టీజర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అక్టోబర్ నెల 22వ తేదీన కొమరం భీమ్ పుట్టినరోజు సందర్భంగా రామరాజు ఫర్ భీమ్ టీజర్ రిలీజైంది.

TeluguStop.com - మరో టాలీవుడ్ రికార్డును సొంతం చేసుకున్న ఎన్టీఆర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

గత నెల 14వ తేదీ నాటికి ఈ టీజర్ కు వేగంగా 30 మిలియన్ల వ్యూస్, వన్ మిలియన్ లైక్స్ దక్కించుకున్న టీజర్ గా రికార్డులు నమోదయ్యాయి.అలా జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో ఒక రికార్డు నమోదు కాగా తాజాగా 2 లక్షలకు పైగా కామెంట్లను దక్కించుకోవడంతో ఈ టీజర్ ద్వారా ఎన్టీఆర్ ఖాతాలో మరో టాలీవుడ్ రికార్డ్ చేరింది.

గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఏ టీజర్ కు లేని రికార్డ్ ఎన్టీఆర్ టీజర్ సొంతం చేసుకుంది.ఈ టీజర్ కు ఇప్పటివరకు 32 లక్షల వ్యూస్ రాగా 11 లక్షల లైకులు వచ్చాయి.అరుదైన రికార్డులు జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో చేరడంతో ఎన్టిఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన భీమ్ ఫర్ రామరాజు టీజర్ సైతం యూట్యూబ్ లో కొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే.

మరోవైపు వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్, జునియర్ ఎన్టీఆర్ కెరీర్ లలో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

#Rajamouli #Junior NTR #FirstTollywood #200k Comments #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు