కళ్యాణ్ రామ్ ను వదలని ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు కళ్యాణ్ రామ్. అయితే కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఈ మధ్య కాలంలో తెరకెక్కిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

 Junior Ntr Next Movie Under Kalyan Ram Movie Banner-TeluguStop.com

అయితే అన్నకు నిర్మాతగా సక్సెస్ ఇవ్వాలని భావిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గతంలో కళ్యాణ్ రామ్ బ్యానర్ లో జై లవకుశ అనే సినిమాలో నటించారు.ఆ సినిమాకు కళ్యాణ్ రామ్ కు బాగానే లాభాలు వచ్చాయి.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటన వెలువడింది.ఈ సినిమా హారికా హాసిని బ్యానర్ తో పాటు కళ్యాణ్ రామ్ కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్నట్టు ప్రకటన వెలువడింది.

 Junior Ntr Next Movie Under Kalyan Ram Movie Banner-కళ్యాణ్ రామ్ ను వదలని ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఎన్టీఆర్ కొరటాల శివ బ్యానర్ పై ఒక సినిమా తెరకెక్కుతున్నట్టు నిన్న ప్రకటన వెలువడింది.

ఈ సినిమాకు మిక్కిలినేని సుధాకర్ నిర్మాత కాగా కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఎన్టీఆర్ తన సినిమాలకు కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ సినిమాలకు భారీగా క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 2022 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ కానుంది.

జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలకు కూడా కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తారేమో చూడాల్సి ఉంది.ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కే ఒక సినిమాలో నటిస్తున్నారు.

ఎన్టీఆర్ జూన్ సెకండ్ వీక్ నుంచి కొరటాల శివ సినిమా షూటింగ్ లో పాల్గొంటుండగా శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది.

#NTR Arts #Junior NTR #Kalyan Ram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు