ఫస్ట్ వీక్ కలెక్షన్లతో ఆ రికార్డును సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR)దేవర సినిమాతో ఫస్ట్ వీక్ లోనే 405 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా 400 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న మూవీ దేవర కావడం గమనార్హం.

దేవర సెకండాఫ్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించినా సినిమాలో కొన్ని అద్భుతమైన సీన్లు ఉండటంతో దేవర పైసా వసూల్ మూవీ అనిపించుకుంది.

కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.దేవర సినిమా( Devara movie) సక్సెస్ కొరటాల శివకు ఎంతో ప్లస్ అయింది.ఆచార్య సినిమాతో డీలా పడిన కొరటాల శివకు ఈ సినిమాతో మార్కెట్ మరింత పెరిగిందని చెప్పవచ్చు.

కొరటాల శివ( Koratala Shiva) మార్క్ డైలాగ్స్ ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయ్యాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.

Advertisement

దేవర1 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా కళ్యాణ్ రామ్ కు నిర్మాతగా కూడా ఈ సినిమా మంచి లాభాలను అందించిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.దేవర సినిమా మాస్ సినిమాలలో స్పెషల్ సినిమాగా నిలిచింది.

యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు హైలెట్ అయ్యాయి.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినీ కెరీర్ పైనే పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు.

జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తారక్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.తారక్ తో సినిమాలను నిర్మించడానికి ప్రముఖ టాలీవుడ్ బ్యానర్లు పోటీ పడుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ పరంగా ఒకింత టాప్ లో ఉన్నారు.

పుష్ప2 లో బన్నీ ధరించిన దుస్తుల వెనుక అసలు కథ ఇదే.. అక్కడే కొనుగోలు చేశారా?
Advertisement

తాజా వార్తలు