ట్విట్టర్ లో 5 మిలియన్ క్లబ్ లో చేరిన ఎన్టీఆర్

టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్.నందమూరి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న వారి సహాకారం లేకుండా కేవలం తన టాలెంట్ తోనే ఎదిగిన నటుడగా తారక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.

 Jr Ntr Crossed 5 Million Twitter Followers, Tollywood, Rrr Movie, Social Media,-TeluguStop.com

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ యాక్టర్స్ లో తారక్ పేరు కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది.ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా రిప్రజెంట్ అవుతున్నాడు.

ఈ సినిమాతో ఎన్టీఅర్ టాలెంట్ ఇండియన్ వైడ్ గా సినీ అభిమానులు అందరికి తెలుస్తుంది.ఇక ఈ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతుంది.

ఇదిలా ఉంటే తారక్ ఇమేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది.ఆర్ఆర్ఆర్ రామరాజు టీజర్ కి ఒక్క మలయాళీ తప్ప అన్ని బాషలలో డబ్బింగ్ చెప్పి తనలోనే మరో టాలెంట్ ని తారక్ బయటపెట్టాడు.

దీనిని బట్టి సినిమాలో అన్ని భాషలకి తన సొంత గొంతుకని ఎన్టీఆర్ వినిపించబోతున్నాడని తెలుస్తుంది.ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కూడా తారక్ ఫాలోయింగ్ రోజు రోజుకి పెరిగిపోతుంది.

తాజాగా ట్విట్టర్ లో ఎన్టీఆర్ ఫాన్స్ ఫాలోయింగ్ ఐదు మిలియన్స్ క్రాస్ చేసింది.చాలా వేగంగా తారక్ ట్విట్టర్ ఈ ఫీట్ ని అందుకోవడం విశేషం.టాలీవుడ్ లోట్విట్టర్ ఫాలోయింగ్ లో అతని కంటే ముందు వరుసలో మహేష్ బాబు, కింగ్ నాగార్జున, దగ్గుబాటి రానా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube