జూనియర్ ఎన్టీఆర్ కు సీఎం కావాలనే ఆలోచన లేదా.. దృష్టి దానిపై ఉందా?

Junior Ntr Focus On Cm Seat Details Here Goes Viral In Social Media,junior Ntr,cm Ntr,tdp, Ntr Politics,prashant Neel,koratala Siva,rrr

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) సీఎం కావాలని కోరుకునే ప్రేక్షకుల సంఖ్య భారీ స్థాయిలోనే ఉంది.చంద్రబాబు ఎక్కడ పర్యటించినా సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్( CM NTR ) అనే నినాదాలు వినిపిస్తూ ఉంటాయి.

 Junior Ntr Focus On Cm Seat Details Here Goes Viral In Social Media,junior Ntr,c-TeluguStop.com

అయితే జూనియర్ ఎన్టీఆర్ కు సీఎం కావాలనే ఆలోచన ఉందా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం లేదనే సమాధానం వినిపిస్తుండటం సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఏపీలో జరిగిన గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో( MLC Elections ) టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో బాలయ్య ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఒకింత ఘాటుగా సెటైర్లు వేశారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ ఫలితాల గురించి స్పందించడానికి అస్సలు ఇష్టపడటం లేదు.జూనియర్ ఎన్టీఆర్ కు కెరీర్ పరంగా కూడా కొత్త సవాళ్లు ముందున్నాయి.

ఆర్.ఆర్.ఆర్( RRR ) క్రేజ్ ను కాపాడుకోవడంతో పాటు మరిన్ని విజయాలను అందుకోవాల్సిన బాధ్యత ఎన్టీఆర్ పై ఉంది.

ఫ్యాన్స్ సీఎం సీఎం అని నినాదాలు చేస్తున్నా తారక్ మాత్రం నోరు మెదపడం లేదు.

రాజకీయాలకు సంబంధించి ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు స్పందించాల్సిన అవసరం తారక్ కు ఏముంటుందని కొంతమంది చెబుతున్నారు.ప్రస్తుతం సినీ కెరీర్ పై తారక్ కు పూర్తిస్థాయిలో దృష్టి ఉందని మరి కొందరు చెబుతున్నారు.ఎన్టీఆర్30 విషయంలో కొరటాల శివ( Koratala Siva )పై ఉన్న బరువు అంతాఇంతా కాదు.

జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాలకు సంబంధించి కొన్ని ఆలోచనలు ఉన్నా సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని తారక్ రాజకీయాల్లో యాక్టివ్ కావాలంటే మరో ఐదేళ్ల సమయం పడుతుందని రాజకీయ విశ్లేషకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తుతం టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.ఈ ఏడాదే ప్రశాంత్ నీల్( Prashant Neel ) సినిమాను మొదలుపెట్టాలని తారక్ భావిస్తుండగా త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Video : Junior Ntr Focus On Cm Seat Details Here Goes Viral In Social Media #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube