ఆ టీవీ ఛానెళ్లను బ్యాన్ చేయాలి.. ట్రెండ్ చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే.అటు పొలిటికల్ గా ఇటు సినిమాల విషయంలో వివాదాలకు దూరంగా ఉండటానికి ఎన్టీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు.

 Junior Ntr Fans Comments About Tv Channels Ban Details Here Goes Viral , Junior-TeluguStop.com

తను ఏ విషయం గురించైనా స్పందించాల్సి వస్తే వీలైనంత వరకు వివాదాస్పదం కాకుండా స్పందించడానికి జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.అయితే గత నాలుగు రోజులుగా ఎన్టీఆర్ గురించి కొన్ని ఛానెళ్లు కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నాయి.

ఈ ప్రచారం ఎన్టీఆర్ అభిమానులను బాధపెడుతోంది.అయితే కొన్ని న్యూస్ ఛానెళ్లు జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా జోరుగా ప్రచారం చేస్తున్నాయి.

 Junior Ntr Fans Comments About Tv Channels Ban Details Here Goes Viral , Junior-TeluguStop.com

ప్రధానంగా టీవీ5, ఏబీఎన్, మహా న్యూస్ ఛానెళ్లు ఎన్టీఆర్ ను కించపరిచే విధంగా కథనాలను ప్రచారం చేస్తుండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఈ టీవీ ఛానెళ్లను బ్యాన్ చేయాలంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్ చేస్తున్నారు.

ఆ ఛానెళ్లు తమ ఫేవరెట్ హీరోను టార్గెట్ చేశాయని అందువల్లే ఆ ఛానెళ్లను టార్గెట్ చేయాల్సి వచ్చిందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.ఈ ట్రెండింగ్ గురించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది.

ఎన్టీఆర్ అభిమానులను హర్ట్ చేసే విధంగా జరుగుతున్న ప్రచారంపై ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం రియాక్ట్ అవుతున్నారు.

హీరోలను టార్గెట్ చేసి ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని వాళ్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇతర హీరోల ఫ్యాన్స్ మద్దతు కూడా ఎన్టీఆర్ అభిమానులకు లభిస్తుండటం గమనార్హం.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ తో బిజీ కానుండగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube