ఆ విషయంలో వెనుకడుగు వేసిన ఎన్టీఆర్.. ఏడాదిన్నర వృథా అయిందిగా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లలో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్లతో తెరకెక్కుతుండగా ఈ సినిమాలు పూర్తి చేయడానికి కనీసం మూడేళ్ల సమయం పట్టే అవకాశం అయితే ఉంది.

 Junior Ntr Decision Effect On Director Buchibabu Cine Career Details Here , 60-TeluguStop.com

ఈ రెండు సినిమాల విషయంలో తారక్ సైతం క్లారిటీతో ఉన్నారు. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు మరి కొందరు డైరెక్టర్లు కథలు చెప్పినా ఎన్టీఆర్ నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ లభించలేదు.

అయితే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కాల్సిన సినిమా దాదాపుగా ఆగిపోయినట్లేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు కాగా ఆరోజు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ అయితే ఉండదని తెలుస్తోంది.

ఎన్టీఆర్ 32వ సినిమాకు డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు క్లారిటీ రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని సమాచారం అందుతోంది.

ఉప్పెన సినిమా తర్వాత ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తారనే నమ్మకంతో బుచ్చిబాబు ఏడాదిన్నర సమయం వృథా చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బుచ్చిబాబు ఎన్టీఆర్ సినిమానే నమ్ముకుంటే కెరీర్ విషయంలో నష్టపోయే అవకాశం అయితే ఉంది.ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలలో సైతం ఎన్టీఆర్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.

ఎన్టీఆర్ ప్రస్తుతం రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు.

Telugu Range, Career Effect, Buchibabu, Ntr, Koratala Shiva, Prashant Neil-Movie

ప్రస్తుత కాలంలో పెద్ద హీరోల సినిమాలలో ఒక్క సినిమా ఫ్లాప్ అయినా ఆ ఫ్లాప్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపుతుందనే సంగతి తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లు కచ్చితంగా సక్సెస్ అయ్యేలా కెరీర్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

ఎన్టీఆర్ ప్రాజెక్ట్ వల్ల ఉప్పెన డైరెక్టర్ కు ఏకంగా ఏడాదిన్నర వృథా అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube