ఆ ఇద్దరు వ్యక్తులు తారక్ ను మోసం చేశారా.. 12 ఎకరాలు ల్యాండ్ కొంటామని చీట్ చేశారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) తన స్నేహితులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే.తన చుట్టూ ఉండేవాళ్లను సైతం తారక్ ఎంతో నమ్ముతారు.

 Junior Ntr Cheated By His Friends Details Here Goes Viral In Social Media , D-TeluguStop.com

సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును సైతం తారక్ తెలివిగా ఇన్వెస్ట్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే 2010 సంవత్సరం సమయంలో తారక్ కు సన్నిహితంగా ఉండే ఇద్దరు వ్యక్తులు ఆయన పేరుపై ల్యాండ్ కొంటామని చెప్పి చీట్ చేశారట.

ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ ఇద్దరు వ్యక్తులకు దూరంగా ఉంటూ వచ్చారట.టీడీపీ కీలక నేత చింతమనేని ప్రభాకర్ ( Chintamaneni Prabhakar )జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు నేతల చేతిలో మోసపోయారని అందుకే ఆ ఇద్దరు నేతలకు దూరంగా ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తే మాత్రమే ఈ వార్తలలో నిజానిజాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కోకాపేట( Kokapet )లో ఎకరం ల్యాండ్ వాల్యూ 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

ఆ సమయంలో తారక్ పేరుపై నిజంగా ల్యాండ్ కొని ఉంటే ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ సులువుగా 1200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.అయితే రాజకీయ నేతల ఆరోపణలను పూర్తిస్థాయిలో నమ్మలేము.యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ సినిమాలతో మళ్లీ బిజీ అవుతున్నారు.ఎన్టీఆర్ దేవర సినిమా( Devara movie )తో ఇతర భాషల్లో సోలో హీరోగా మార్కెట్ ను మరింత పెంచుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు రావడంతో పాటు 100 కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలు వస్తున్నట్టు సమాచారం అందుతోంది.తారక్ కెరీర్ పరంగా క్రేజ్ అంతకంతకూ పెంచుకుంటున్నారు.

ఎన్టీఆర్ క్రేజ్ పరంగా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నా ఆయన పేరు మాత్రం తరచూ ఏదో ఒక విధంగా వినిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube