ఫ్యాన్సీ నెంబర్ కోసం యంగ్ టైగర్ ఎంత ఖర్చు పెట్టాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

కొందరికి సినిమాలంటే పిచ్చి.కొందరికి ఆటలంటే ఇష్టం.

 Junior Ntr Buys Fancy Car Number 9999 For-rs 17 Lakhs Jr Ntr, Tollywood, Hero, F-TeluguStop.com

మరికొందరికి ట్రావెలింగ్ అంటే గంతేస్తారు.అలాగే మన యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌కు కార్లంటే మక్కువ.

ఈ మధ్యే కోట్లు ఖర్చు పెట్టి లంబోర్ఘిని ఊరుస్‌ కారును కూడా ప్రత్యేకంగా ఇటలీ నుంచి తెప్పించుకున్నారు.ఆ కారు కోసం కోట్లు పెట్టిన తారక్‌ .ఫ్యాన్సీ నంబర్‌ కోసం లక్షలు గుమ్మరించినట్టు తెలుస్తోంది.తాజాగా ఖైరతాబాద్‌ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్లకు వేలం వేశారు.ఇందులో జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ.17 లక్షలు పెట్టి TS 09 FS 9999 నంబర్‌ దక్కించుకున్నారు.ఆ రోజు జరిగిన అన్ని ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఇదే హయ్యస్ట్‌ బిడ్‌ అని అధికారులు చెప్తున్నారు.

ఇలా కోట్లకు కొట్టు పెట్టి మార్కెట్లోకి వచ్చిన కారును కొనడం ఎన్టీఆర్‌కు కొత్తమీ కాదు.

ఓ రకంగా చెప్పాలంటే ఆయనకిది హాబీలా అయిందనే చెప్పాలి.కారు కోసం కోట్లు పెట్టిన తారక్ఫ్యా న్సీ నంబర్‌ను దక్కించుకునేందుకు వెనకడుగు ఎలా వేస్తారు ? అందుకే తనకిష్టమైన నంబర్‌ను పొందడానికి ఎంతైనా ఖర్చు చేస్తూ వస్తున్నారు ఎన్టీఆర్./br>

Telugu Lacs, Car Number, Fancy Number, Jr Ntr, Rrr, Tollywood-Movie

గతంలోనూ తారక్‌ పది లక్షలు పెట్టి ఫ్యాన్సీ నంబర్‌ను సొంతం చేసుకున్నాడు.అయితే ఈసారి ఏకంగా రూ.17 లక్షలు పెట్టి ఫ్యాన్సీ నంబర్‌ దక్కించుకుని తన రికార్డును తనే బద్ధలు చేసుకోవడం విశేషం.కాగా ఎన్టీఆర్‌ దగ్గరున్న కార్లకు అన్నింటికీ 9999 నంబర్‌ ఉంటుంది.

కొత్తగా ఏ కారు తీసుకున్నా కూడా దానికి కూడా అదే నెంబర్‌ వచ్చేలా జాగ్రత్తపడతారని సమాచారం.తన తాత గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు, తండ్రి హరికృష్ణ కూడా 9999 కారు నంబర్‌నే వాడారని తెలుస్తోంది.

అందుకే తనకు ఆ నెంబర్‌ ఇష్టమని, అలా దాన్ని కంటిన్యూ చేస్తున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఎన్టీఆర్.కార్లే కాదండోయ్.ఆయన ట్విటర్‌ ఖాతా కూడా @tarak9999 అనే ఉంటుంది.వీలైతే ఒకసారి చెక్‌ చేసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube