118 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్స్ గా జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, కె.వి.

 Junior Ntr And Balakrishna Will Be Attend As A Chief Guest For 118 Movie-TeluguStop.com

గుహన్ దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మాతగా 118 సినిమా తెలిసిందే.సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి కళ్యాణ్ రామ్ కెరీర్లో డిఫరెంట్ మూవీ గా ఉండబోతుందని టాక్ తెచ్చుకుంది.హీరో కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

ఇందులో శాలిని పాండే, నివేతా థామస్ కళ్యాణ్ రామ్ కి జోడీగా నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం 118 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి నిర్మాత రెడీ అయ్యాడు.

ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ లుగా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు నందమూరి బాలకృష్ణ కూడా వస్తూ ఉండడం ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.హరికృష్ణ మరణం తర్వాత ఒకటైన బాబాయ్ అబ్బాయిలు, మరోసారి చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై సినిమా ప్రమోషన్ లో పాలు పంచుకోవడం విశేషం.

ఎన్టీఆర్ బయోపిక్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంతో టాలీవుడ్ లో మరల కొద్ది రోజులుగా బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాబాయ్ అబ్బాయిలు కలయిక నందమూరి ఫ్యాన్స్ కి కూడా శక్తి పెంచుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube