ఆ సీరియల్ లో అద్భుతంగా నటించిన జూనియర్ ఎన్టీఆర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ నేపథ్యం ఉన్నప్పటికీ స్వయంకృషితో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ గా ఎదిగారు.కెరీర్ ప్రారంభంలోనే ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి సినిమాసినిమాకు రేంజ్ పెంచుకున్నారు.

 Junior Ntr Acted Bhakta Markandeya Tele Serial In His Childhood, Bhakta Markande-TeluguStop.com

మధ్యలో అడపాదడపా ఫ్లాపులు వచ్చినా ఎన్టీయార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు.సినిమాసినిమాకు కథలో, పాత్రలో వైవిధ్యం చూపిస్తూ నటుడిగా ఎన్టీఆర్ అంతకంతకూ ఎదుగుతున్నారు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు.ముందుగా అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తై ఉంటే 2021 జనవరి 8వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుదలై ఉండేది.

అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది.కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాతే ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అయితే జూనియర్ ఎన్టీఆర్ బాల్యంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం సినిమాల్లో నటించాడని… నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడని మనందరికీ తెలుసు.అయితే జూనియర్ ఎన్టీఆర్ ఒక సీరియల్ లో కూడా నటించాడు.

ఆ సీరియల్ పేరు భక్త మార్కండేయ.ఈటీవీలో ప్రసారమైన ఈ సీరియల్ లో ఎన్టీఆర్ భక్త మార్కండేయుని పాత్రలో నటించి మెప్పించాడు.ఈ పాత్రలో జూనియర్ లుక్ అద్భుతంగా ఉంది.

ఈ సీరియల్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ పూర్తిస్థాయి హీరోగా సినిమాల్లోకి ప్రవేశించాడు.

ఎన్టీఆర్ నటించిన తొలి సినిమా నిన్ను చూడాలని ఫ్లాప్ అయినా స్టూడెంట్ నంబర్ వన్ సినిమా ద్వారా రెండో సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు.ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ 34 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడని తెలుస్తోంది.2021 దసరా లేదా 2022 సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube