ఏపీపీఎస్సీ : జేఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ !

ఏపీపీఎస్సీ నుంచి వరుస వరుసగా… ఉద్యోగాల నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి.తాజాగా… ఏపీ ఇంట‌ర్మీడియ‌ట్ ఎడ్యుకేష‌న్‌లో జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీకి ఏపీపీఎస్సీ శుక్రవారం (డిసెంబరు 28) నోటిఫికేషన్ జారీచేసింది.దీనికి సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.అభ్యర్థలు నిర్ణీత మొత్తంతో దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి జనవరి 18 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 Junior Lecturers Notificationreliged By Appsc-TeluguStop.com

అయితే ఫిబ్రవరి 7 వరకు మాత్రమే ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది.

పోస్టుల వివ‌రాలు…
* జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్లు: 237 పోస్టులు

స‌బ్జెక్టుల వారీగా ఖాళీలు…

సబ్జెక్టు ఖాళీలు
ఇంగ్లిష్ 19
తెలుగు 18
హిందీ 17
ఉర్దూ 04
సంస్కృతం 03
ఒరియా 02
మ్యాథ‌ఫిజిక్స్ 19
కెమిస్ట్రీ 21
బోట‌నీ 19
జువాలజీ 20
కామ‌ర్స్ 18
ఎక‌నామిక్స్ 25
సివిక్స్ 18
హిస్టరీ 18

మొత్తం ఖాళీలు (క్యారీ ఫార్వర్డ్ – 37, ఫ్రెష్- 200) 237
విద్యార్హ‌త‌లు: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ డిగ్రీ (ఎంఏ/ ఎంఎస్సీ/ ఎంకాం/ బీఎస్సీ ఆన‌ర్స్/ బీఏ ఆన‌ర్స్/ బీకాం ఆన‌ర్స్) లేదా ఇత‌ర త‌త్స‌మాన పీజీ ఉత్తీర్ణ‌త‌ ఉండాలి.

వయోపరిమతి:01.07.2018 నాటికి 18-42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ప్రభుత్వ సర్వీసుల్లో కనీసం 6 నెలల సర్వీసు ఉన్న తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.

ఫీజు:అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250; పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది.ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక‌ విధానం: స్క్రీనింగ్ టెస్ట్‌/ ప్రిలిమిన‌రీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

పరీక్ష విధానం.
– రాతపరీక్షలో మొత్తం రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి.మొత్తం
– పేపర్-1లో 150 మార్కులకుగాను జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు.ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు.డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి.
– పేపర్-2లో 300 మార్కులకుగాను సంబంధిత సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు.ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు.పీజీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి.
– దరఖాస్తు చేసకున్న అభ్యర్థుల సంఖ్య 25 వేలు దాటితే ఆఫ్‌లైన్ విధానంలో లేదా 25 వేలలోపు ఉంటే ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్షలు నిర్వహిస్తారు.
– అభ్యర్థులు తమకు నచ్చిన మాధ్యమంలో పరీక్ష రాయవచ్చు.
– పరీక్ష సమయం ఒక్కో పేపర్‌కు 150 నిమిషాలుగా నిర్ణయించారు.
– నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి.ప్రతి తప్పు సమాధానానికి 0.33 చొప్పున మార్కులు కోత విధిస్తారు.
– చివరగా 50 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది నియామకాలు చేస్తారు.

ముఖ్యమైన తేదీలు


ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం 18.01.2019.

ఫీజు చెల్లింపు చివ‌రితేది 07.02.2019.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది 08.02.2019.

స్క్రీనింగ్ పరీక్ష తేది (ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్) ప్రకటించాల్సి ఉంది.

మెయిన్ పరీక్ష తేది (ఆన్‌లైన్) 2019 జులైలో.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube