లారెన్స్ తమ్ముడు వేధిస్తున్నాడు! జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు

సౌత్ ఇండియాలో దర్శకుడుగా, హీరోగా, కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి రాఘవ లారెన్స్.ఇతను కేవలం సినిమాల ద్వారానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా సొసైటీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.

 Junior Artist Raise Harassment Allegations On Lawrence Brother-TeluguStop.com

వికలాంగులని చేరదీసి వారికి డాన్స్ లో నైపుణ్యం అందించి తన సినిమాలలో అవకాశం ఇవ్వడంతో పాటు, పేదల పిల్లలకి గుండె ఆపరేషన్స్ చేయించడం వరకు లారెన్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.అలాగే హిజ్రాలకి సొంత ఇల్లు కట్టించడానికి సిద్ధమయ్యాడు.

అయితే ఇంత సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా సంఘంగా గౌరవంగా ఉన్న లారెన్స్ కి తమ్ముడు రూపంలో ఇప్పుడు చిన్న కలకంగా ఏర్పడింది.

రాఘవ తమ్ముడు తనను వేధిస్తున్నాడంటూ వరంగల్ జిల్లాకు చెందిన దివ్య అనే జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపిస్తుంది.

అతని ప్రేమను తాను తిరస్కరించడంతో వేధించడం మొదలు పెట్టాడని చెప్పింది.తాజాగా మీడియా ముందుకి వచ్చిన ఆమె మాట్లాడుతూ వినోద్ వేధింపులను తట్టుకోలేక హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని అయితే సీఐతో లారెన్స్ తమ్ముడు కుమ్మక్కై తనపై తిరిగి తప్పుడు కేసులు పెట్టారని తెలిపింది.

ఇప్పుడు ఆ అధికారి ఏసీపీగా ఉన్నారని చెప్పింది.ఆ అధికారి లారెన్స్ కు సన్నిహితుడుగా మారిపోయారని తెలిపింది.వీరందరి చీకటికోణాలు తనకు తెలుసని చెప్పింది.ఆ అధికారి అండతోనే తనని జైలుకి పంపించారని దివ్య ఆరోపిస్తుంది.

లారెన్స్ తమ్ముడితో తనకు ప్రాణ భయం ఉందని చెప్పింది.తనని అతని నుంచి కాపాడాలని కోరుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube