జూన్ నెలలో పుట్టారా... అయితే మీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు     2018-01-11   04:42:28  IST  Raghu V

జూన్ నెలలో పుట్టినవారు చాలా షార్ప్ గా ఉంటారు. వీరి మెదడు చాలా చురుకుగా ఉండటం వలన ఎక్కువ తెలివితేటలను కలిగి ఉంటారు. ఏ పని అయినా వెంటనే ప్రారంభించటమే కాకుండా తొందరగా కూడా పూర్తి చేస్తారు. వీరికి మేధో శక్తి ఎక్కువగా ఉండుట వలన ఏ విషయాన్నీ అయినా చాలా తొందరగా గ్రహించేస్తారు. వీరికి నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా విషయాన్నీ నమ్మితేనే ఆచరణలో పెట్టటానికి సిద్ధం అవుతారు. వీరు అందరిలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు.

వీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. ఈ నెలలో పుట్టినవారికి కొన్ని కష్టాలు వస్తాయి. అయితే వీరి తెలివితేటల ముందు ఆ కష్టాలు ఎందుకు పనికిరాకుండా పోతాయి. వీరు సొంత ఆలోచనలతో కష్టాలను సులువుగా అధికమిస్తారు. వీరికి మానసిక మరియు శారీరక శక్తి ఎక్కువగానే ఉంటుంది. వీరు జీవితంలో ఎన్నో విజయాలను పొందుతారు. అలాగే కష్ట సుఖాలను అధిరోహిస్తూ జీవితాన్ని ఆనందమయము చేసుకుంటారు. వీరు ఎక్కువగా వారి కష్టాన్నే నమ్ముకుంటారు. ఇతరుల మీద ఆధారపడాలని ఎప్పుడు అనుకోరు.

వీరికి కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తారు. అలాగే వారికీ ఏ సమస్య వచ్చిన తట్టుకోలేరు. వెంటనే పరిష్కారం కోసం అన్వేషిస్తారు. ఒకవైపు ఉద్యోగం లేదా వ్యాపారం మరోవైపు కుటుంబం రెండింటిని బేలన్స్ చేయటంలో సిద్దహస్తులు.

ఆరోగ్యము : ఈ నెలలో జన్మించిన వారికి నీరసం, బలహీనత, రక్తపోటు వంటి వాటితో ఎక్కువగా బాధ పడతారు. కాబట్టి ఈ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది.
ధనము : స్వంత నిర్ణయాలతో ముందుకు పోతూ వ్యాపార రీత్యా మంచి లాభాలు గడుస్తారు.

లక్కీ వారములు : ఆదివారం, బుధ వారం.

లక్కీ కలర్ : ఆకుపచ్చ రంగు, పసుపు రంగు.

లక్కీ స్టోన్ : ఆకుపచ్చ , తెలుపురంగు.