సీటు ఇస్తారా .... గోడ దూకమంటారా ..? అధినేతలనే అదరగొడుతున్న నాయకులు

నాయకులను పార్టీ అధినేతలు బెదరగొట్టడం ఒకప్పటి మాట … కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది.నాయకులే ఆయా పార్టీల అధినేతలను బెదరగొడుతూ… తమ డిమాండ్స్ నెరవేర్చుకుంటున్నారు.

 Jumping Candidates In Andhra Pradesh Parties-TeluguStop.com

ఎందుకంటే ఇదివరకు నాయకులకు పెద్దగా ఆప్షన్స్ కనిపించేవి కాదు.కానీ ఇప్పుడు అనేక పార్టీలు పుట్టుకురావడంతో … ఈ పార్టీ కాకపోతే ఏంటి ఆ పార్టీ ఉంది కదా అనే ధీమాలో నాయకులు ఉన్నారు.

అందుకే ఆయా పార్టీల నేతలు కూడా ఎవరినీ హర్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా… మసులుకుంటున్నారు.ఇక అసలే ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో… టికెట్ల ఆశించేవారు సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది.

దీంతో తాము కోరిన చోట సీటు హామీ ఇస్తారా లేక తమకు అనుకూల పార్టీలోకి జంప్ చేయమంటారా అనే డిమాండ్స్ బాగా పెరిగిపోయాయి.అన్ని ప్రధాన పార్టీల్లోనూ ఇదే తంతు కనిపిస్తోంది.

ఎన్నికల సమరంలో మిగతా అన్ని పార్టీలకంటే ముందుగా ఉండాలని భావించిన చంద్ర బాబు ఆరునెలల ముందుగానే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామంటూ హడావిడి చేసాడు.కానీ ఆ విషయంలో కాస్త వెనకడుగు వేసాడు.అయితే… కొద్దీ మందికి మాత్రం సైలెంట్ గా సీటు ఒకే చేస్తున్నాడు.ఇక వైసీపీ విషయానికి వస్తే… నియోజకవర్గ ఇన్ ఛార్జులుగా ఉన్నవారిని మారుస్తూ గందరగోళం శ్రీష్టిస్తున్నాడు వైసీపీ అధినేత జగన్.

అభ్యర్థుల ప్రకటనలో కూడా అందుకే ఏ విషయం తేల్చకుండా ….నాంచివేత ధోరణి అవలంభిస్తున్నాడు.మరో నెలరోజుల్లో ఎన్నికల షెడ్యూలు రాబోతోంది.మూడు నెలలలోపు ఎన్నికల తంతు ముగియబోతోంది.అయినప్పటికీ ప్రధానపార్టీలు అభ్యర్థుల ప్రకటన చేయడానికి వెనుకంజ వేస్తున్నాయి.

ఏదో ఒక రీజన్ చెప్తూ… అభ్యర్థుల ప్రకటన ఆలస్యం చేస్తున్నాయి.

దీనంతటికి కారణం నాయకులు ఎక్కడ గోడ దూకి పక్క పార్టీల్లోకి జంప్ చేస్తారో అనే అనుమానమే కారణం.ఏపీలో ప్రస్తుతం పోటాపోటీ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఆయా నియోజకవర్గాల్లో ఎవరి ప్రత్యర్థి ఎవరో తేలకుండా… ఎవరో ఒకరికి టిక్కెట్టు ఇచ్చేస్తే మునిగిపోతామనే భావనలో ఉన్నాయి పార్టీలు.

ఫలితంగా అభ్యర్థుల్లో అసహనం నెలకొంటోంది.ఎదురుచూపులు ఎన్నాళ్లో తెలియనిస్థితి.

అందుకే జంప్ జిలానీల సంఖ్య కూడా బాగా పెరిగిపోతోంది.పార్టీల కోసం కష్టపడే వారు ప్రస్తుతం అరుదుగానే కనిపిస్తున్నారు.తమకు సీటు ఇచ్చిన పార్టీకే జై కొడదాం లేకపోతే పార్టీకి గుడ్ బాయ్ చెబుదాం అనే ధోరణి నాయకుల్లో ఎక్కువగా ఉండడం ఆయా పార్టీల అధినేతలకు పెద్ద తలనొప్పిగా మారింది.అందుకే పెద్దగా ఎవరినీ ఏమీ అనలేక … అలా ఉండలేక సంకట స్థితిలో పడిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube