ఒక దెబ్బకు రెండు పిట్టలు ! ఎన్టీఆర్ కి ఝలక్ .. లోకేష్ కి క్లియర్

టీడీపీ జాతీయడీక్షుడు చంద్రబాబు నాయుడు తెలివితేటలు.ముందు చూపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Julak To Ntr Lince Clea To Lokesh-TeluguStop.com

ఎప్పుడో రాబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి అందుకు అనుగుణంగా వేయాల్సిన ఎత్తుగడలను వేసి రాజకీయంగా ఎదురులేకుండా… చేసుకోవడం బాబు తెలివితేటలకు నిదర్శనం.ప్రస్తుతం బాబు వైయస్ మీరుతుండడం … రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం వస్తుండడంతో… తన రాజకీయ వారసుడు లోకేష్ కి అన్ని విధాలుగా ఎదురులేకుండా చేయాలనుకుంటున్నాడు.

అందులో భాగంగా భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ నుంచి లోకేష్ కి ముప్పు ఉందని ముందుగానే గ్రహించిన బాబు ఆయన్ను అనూహ్యంగా పక్కనపెడుతూ వచ్చాడు.

అయితే ఈ సమయంలో నందమూరి కుటుంబాన్ని పక్కనపెడుతున్నాడు అనే అపవాదు రాకుండా ఇప్పటికే బాలయ్యను చేరదీసాడు.తాజాగా.తెలంగాణ ఎన్నికల్లో.

కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిని పోటీ దించడం వెనక బాబు పక్కా వ్యూహంతో వ్యవహరించినట్లు అర్థమవుతోంది.నందమూరి కుటుంబం తెలంగాణలో, నారా కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిపించడానికి తగిన రాజకీయ వ్యూహ రచన అందులో ఉన్నట్లు తెలుస్తోంది.

నందమూరి హరికృష్ణ కుమారుడు కల్యాణ్ రామ్ ను కూకట్ పల్లి నుంచి పోటీకి దించడానికి ఆయన ప్రయత్నించారు.కల్యాణ్ రామ్ అంగీకరించకపోవడంతో కూతురు సుహాసినిని దించారు.

జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనతో ఉన్నారనేది అందరికీ తెలిసిందే.ఆయన తెలుగుదేశం పార్టీని నడిపించాలనే ఆలోచనతోనే ఉన్నట్లు చెబుతారు.

ఈ స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటే తెలంగాణను ఆయనకు వదిలేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.అందుకే సుహాసినిని పోటీకి దించారని అంటున్నారు.దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన తనయుడు నారా లోకేష్ కు పూర్తిగా లైన్ క్లియర్ అవుతుందనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.నందమూరి కుటుంబం నుంచి నారా లోకేష్ కు దానివల్ల ఏ విధమైన ఇబ్బంది ఉండదు.

సుహాసిని పోటీ చేయడం కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లకు ఇష్టం లేదని తొలుత వార్తలు వచ్చాయి.అయితే, ఇరువురు కూడా తమ అక్కకు మద్దతు తెలియజేస్తూ ప్రకటన చేశారు.

సుహాసినిని పోటీకి దించడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ తనకు వ్యతిరేకంగా పనిచేయడానికి ముందుకు రారని చంద్రబాబు ముందుగానే అంచనా వేసినట్టు కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube