జుట్టు పెరుగుదలను ప్రోత్సాహాన్ని ఇచ్చే పచ్చి జ్యూస్ లు  

Juicing Recipes For Hair Growth -

తాజా పండ్లు మరియు ఆకుపచ్చ కూరలలో ఉండే పోషకాలు మన శరీరానికి మరియు జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి.అందువల్ల మన రోజువారీ ఆహారంలో తాజా రసాలను చేర్చితే జుట్టు బాగా పెరుగుతుంది.

ఈ రసాలు జుట్టు విఘటనను తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ జుట్టు గ్రీవాన్ని రక్షించటానికి మరియు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.అందువల్ల ఇప్పుడు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే రసాల గురించి తెలుసుకుందాం.

Juicing Recipes For Hair Growth-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

1.పాలకూర జ్యూస్
పాలకూరలో అనేక విటమిన్స్, ఖనిజాలు, ఇనుము, యాంటీ ఆక్సిడెంట్, ఫ్లేవనాయిడ్స్ మరియు కెరోటినాయిడ్స్ సమృద్దిగా ఉండుట వలన జుట్టు పెరుగుదల సహాయపడతాయి.ప్రతి రోజు పాలకూర జ్యూస్ తీసుకుంటే జుట్టు పలుచన అవటం మరియు తల చర్మం మీద దురద వంటి సమస్యలను పరిష్కరిస్తుంది.

అలాగే ఈ జ్యూస్ లో ఉండే విటమిన్ B జుట్టు పునరుద్దరణ,కాంతివంతం మరియు పెరుగుదలలో సహాయపడుతుంది.పాలకూరలో ఇనుము సమృద్దిగా ఉండుట వలన జుట్టు రాలు సమస్యను తగ్గిస్తుంది.

2.జామ జ్యూస్
జామలో యాంటీఆక్సిడెంట్స్ మరియు కాల్షియం, ఇనుము, ఫోలిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు సమృద్దిగా ఉంటాయి.

జామ ఆకులను నీటిలో 20 నిముషాలు మరిగించి ఆ నీటిని జుట్టుకు పట్టిస్తే జుట్టు నష్టం తగ్గుతుంది.జామ పండులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది.జామ పండులో యాంటీఆక్సిడెంట్స్, కెరోటినాయిడ్, లైకోపీన్, లుటీన్ వంటివి సమృద్దిగా ఉండుట వలన జుట్టును రక్షించటంలో సహాయపడుతుంది.

3.కొత్తిమీర జ్యూస్
కొత్తిమీర కూడా జుట్టు పతనానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.జుట్టు రంగు కొరకు రాగి,మాంగనీస్ సమృద్దిగా ఉంటాయి.అంతేకాక కొత్తిమీరలో ఒత్తిడి ఉపశమనం లక్షణాలు ఉండుట వలన ఒత్తిడి కారణంగా జుట్టు రాలటాన్ని అరికడుతుంది.కొత్తిమీర జ్యూస్ రుచిని పెంచటానికి ఏదైనా పానీయాన్ని కలపవచ్చు.

జుట్టు పెరుగుదలలో సహాయపడటమే కాకుండా జుట్టు ఒత్తుగా పెరగటానికి కూడా సహాయం చేస్తుంది.కొత్తిమీరను పేస్ట్ గా చేసి జుట్టుకు రాసి ఒక గంట తర్వాత సాదారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

4 .వెల్లుల్లి జ్యూస్

వెల్లుల్లిలో కఠినమైన యాంటి బాక్టీరియా మరియు యాంటి ఫంగల్ ప్రభావాలు ఉంటాయి.వెల్లుల్లి జ్యూస్ జుట్టు గ్రీవమునకు పోషణ అందించి జుట్టు పునరుద్దరణకు సహాయపడుతుంది.వెల్లుల్లిని చికిత్స ప్రక్రియలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు.వెల్లుల్లి రసాన్ని జుట్టుకు రాసినప్పుడు తల మీద చర్మంపై రక్త ప్రసరణ పెరిగి జుట్టుకు మెరుపు మరియు మృదుత్వం వస్తుంది.వెల్లుల్లిలో ఉండే సెలీనియం అనే ఖనిజం తల చర్మం మిద ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు