ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.ఇందులో భాగంగా పిళ్లై తరపు న్యాయవాదితో పాటు ఈడీ వాదనలు కొనసాగాయి.
ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును ఈనెల 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు వెలువరించనున్నట్లు తెలిపింది.కాగా మద్యం కుంభకోణం కేసులో అరుణ్ పిళ్లై ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.