ఆ కోర్టు జడ్జికి కండోమ్ లు పంపిన మహిళ.. ఎందుకంటే..?!

ఏదన్నా కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు జడ్జిమెంట్ అనేది మనం అనుకునే దానికి భిన్నంగా వస్తే తీర్పులు వస్తాయి.మనం ఒకటి అనుకుంటే కోర్టు తీర్పు మరోలా వస్తుంటాయి.

 Judge, Women Judge, Condoms, Send, Viral Latest, Viral News,netizens Comments,so-TeluguStop.com

ఆ తర్వాత అవి చర్చకు దారితీస్తాయి.ఇప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

జస్టిస్ పుష్ప గనిడే వాలా.గారు “పోక్సో” (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫెన్సెస్‌) చట్టం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు .శరీరాన్ని శరీరం తాకలేదు గనుక నేరంగా పరిగణించలేమనడం సహా.ఐదేళ్ల బాలిక చేతులు కట్టేసి పట్టుకుని, ప్యాంటు జిప్‌ తెరచినా ఈ చట్టం కింద అదేమీ నేరం కాదని ఆమె ఇచ్చిన తీర్పుపై భిన్నవాదనలు కొనసాగుతున్నాయి.

ఈ రెండు కేసుల్లోనూ పోక్సో చట్టం నుంచి నిందితులను సపోర్ట్ కలిగించిన తీరు హాట్ టాపిక్ గా మారింది.ఇక ,వివాదాస్పద తీర్పులు వెల్లడించిన బాంబే హైకోర్టు నాగపూర్‌ బెంచ్ జడ్జి జస్టిస్‌ పుష్ప గనేడివాలా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే కేంద్రం ఆమెకు పదోన్నతి కల్పించకూడదనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా తాజాగా ఓ మహిళ పుష్ప గనేడివాలా తీర్పులను నిరసిస్తూ జడ్జికి కండోమ్‌లు పంపింది.

ఆవిడ మరెవరో కాదు అహ్మదాబాద్‌కు చెందిన రాజకీయ విశ్లేషకురాలు దేవ్‌శ్రీ త్రివేది.ఆవిడ ఒక్కదానికే కండోమ్స్ పంపలేదు.

ఆవిడతో పాటు పనిచేసే బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ రిజిస్ట్రీతో పాటు ముంబైలోని మరో 12 వేర్వేరు ప్రదేశాలకు కండోమ్‌ లు పంపినట్లు వెల్లడించింది.ఈ సందర్భంగా దేవ్‌ శ్రీ త్రివేది మాట్లాడుతూ.“అన్యాయాన్ని నేను సహించలేను.గనేడివాలా తీర్పు వల్ల అభం శుభం తెలియని ఓ మైనర్‌ బాలికకు న్యాయం జరగలేదు.

ఆమెని సస్పెండ్‌ చేయాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నాను.ఆమె తీర్పు పట్ల నా నిరసన తెలియజేయడం కోసం ఇలా కండోమ్‌ ప్యాకెట్లు పంపాను అని తెలిపారు.

అలాగే “ఓ మహిళగా నేను చేసిన పని తప్పని భావించడం లేదు.దీని గురించి నాకు ఎలాంటి చింత లేదు.

ఇలాంటి వాటిని ఒక జడ్జి ప్రోత్సహించడం వలన ఆడవాళ్లపై అత్యాచారాలు ఎక్కువ అవుతాయి అని వాపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube