ట్రంప్ టైం బ్యాడ్..కీలక ఆదేశాలపై న్యాయమూర్తి అభ్యంతరం..!!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టైం అస్సలు బాలేదని చెప్పాలి.ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో గడ్డి పోచ కూడా గునపంలా మారిపోతోంది.

 Judge Frederic Blocked The Trump Administration's Effort To Roll Back Transgende-TeluguStop.com

గతంలో తాను తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు ట్రంప్ గెలుపుకి అడ్డు కర్రలా మారుతున్నాయి.ఇప్పటికే ప్రతిపక్ష అధ్యక్ష , ఉపాధ్యక్ష నేతలు బిడెన్, కమలా హారీస్ లు ట్రంప్ గడించిన పాలనపై విమర్శలు చేస్తూ తప్పులు ఎత్తి చూపుతూ బంతాట ఆడేసుకుంటుంటే తాజాగా ట్రంప్ గతంలో తీసుకున్న ఓ విమర్శనాత్మకమైన నిర్ణయాన్ని రద్దు చేస్తూ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో అన్ని రకాలుగా ఆరోగ్య రక్షణ కల్పించే అవకాశాలని ట్రాన్స్ జెండర్ కు అందకుండా రద్దు చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేస్తూ వారికి రక్షణ కల్పించే విధంగా న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పు ప్రకటించారు.ఈ మేరకు హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ విభాగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన రద్దు ఆదేశాలు ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు లోకి రాకూడదని ఆదేశించారు.అయితే

Telugu America, Donald Trump, Federal Judge, Judgefrederic, Trump-

న్యాయమూర్తి ఫెడరిక్ ఇచ్చిన తీర్పు వలన ఇతర ఫెడరిక్ చట్టాలకు సంభందించి పెండింగ్ లో ఉన్న కేసులకి ఈ తీర్పు ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.సుప్రీం కోర్టు ఒక తీర్పుని ఇచ్చిన తరువాత ఆ తీర్పు తీసుకునే నిర్ణయాలపై ప్రభావం తప్పకుండా చూపాలని అప్పుడే తీర్పుకి నిజమైన అర్థం ఉంటుందని న్యాయమూర్తి ఫెడరిక్ తెలిపారు.అయితే తాజా తీర్పుతో ట్రాన్స్ జెండర్స్ సంతోషం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube