భారత్‌లో ఎంట్రీ ఇచ్చిన అమెరికన్ రెస్టారెంట్ చైన్ ‘‘పొపాయెస్’’

ప్రముఖ ఫుడ్ సర్వీస్ కంపెనీ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్ (జేఎఫ్ఎల్).యూఎస్ ఫ్రైడ్ చికెన్ బ్రాండ్ ‘‘పొపాయెస్‌’’ను భారత్‌లో ప్రవేశపెట్టింది.

 Jubilant Foodworks Launches American Restaurant Chain Popeyes In India , Jubilan-TeluguStop.com

ఈ బ్రాండ్ తొలి రెస్టారెంట్‌ను బెంగళూరులో ప్రారంభించింది.న్యూ ఓర్లీన్స్ – స్టైల్ ఫ్రైడ్ చికెన్, చికెన్ శాండ్ విచ్‌లకు పొపాయెస్‌ ప్రసిద్ధి గాంచింది.

ఇది అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన , వేగంగా అభివృద్ధి చెందుతున్న చికెన్ బ్రాండ్‌లలో ఒకటి.బెంగళూరులోని కోరమంగళలో స్టోర్ ప్రారంభించామని, త్వరలో న్యూబీఈఎల్ రోడ్, కమ్మనహళ్లిలలో స్టోర్‌లను ప్రారంభిస్తామని జేఎఫ్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్ చైర్మన్ శ్యామ్ ఎస్ భార్టియా, కో ఛైర్మన్ హరి ఎస్ భార్టియా మాట్లాడుతూ… కోడి మాంసాన్ని అమితంగా ఇష్టపడే భారతీయ వినియోగదారులకు పొపాయెస్ లూసియానా కిచెన్ బ్రాండ్‌ను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు.దీనికి సొంత యాప్, వెబ్‌సైట్ కూడా వుందని.

కస్టమర్‌లు ఇంట్లో కూడా రుచులు ఆస్వాదించవచ్చని వారు పేర్కొన్నారు.డెలీవరిల కోసం ఈ బైక్‌లను వినియోగించడం ఈ కంపెనీ ప్రత్యేకత.

పొపాయెస్ మాతృసంస్థ.ఆర్‌బీఐ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డేవిడ్ షియర్ మాట్లాడుతూ.

భారతీయ అతిథులు పొపాయెస్‌ల నుంచి ఫ్రైడ్ చికెన్‌ని ఇష్టపడతారని తాము ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.పొపాయెస్‌ ఇండియా మెనూలో సిగ్నేచర్ కాజున్ ఫ్లేవర్డ్ చికెన్ శాండ్‌విచ్ వుంటుందని డేవిడ్ తెలిపారు.

మాంసాహారంతో పాటు శాఖాహారం కూడా వుంటుందన్నారు.

పొపాయెస్‌ను లూసియానా రాష్ట్రంలోని అరబిలో 1972 జూన్ 12న స్థాపించారు.

దీని యజమాని అల్ కోప్‌ల్యాండ్.కెంటుకీ ఫ్రైడ్ చికెన్‌తో పోటీపడాలని నిర్ణయించుకున్నాడు.

దీనిలో భాగంగా కంపెనీ పేరును పొపాయెస్ ఫేమస్ ఫ్రైడ్ చికెన్‌గా మార్చారు.దీంతో నెమ్మదిగా ప్రజలు దీనిని ఆదరించడం ప్రారంభించారు.అనతికాలంలోనే అమెరికా వ్యాప్తంగా ఈ సంస్థకు ప్రాంఛైజీలు ప్రారంభమయ్యాయి.1984 నాటికి పొపాయెస్‌ కెనడాకు విస్తరించింది.1985లో 500వ స్టోర్‌ను స్థాపించి అతిపెద్ద చైన్‌లలో ఒకటిగా అవతరించింది.ఫిబ్రవరి 21, 2017న రెస్టారెంట్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ (ఆర్‌బీఐ) 1.8 బిలియన్లకు పొపాయెస్‌ను కొనుగోలు చేసింది.మార్చి 27, 2017న ఆర్‌బీఐ అనుబంధ సంస్థ అయిన ఆరెంజ్ ద్వారా ఒక్కో షేరును 79 డాలర్ల ముఖ విలువతో కొనుగోలు చేయడంతో ఒప్పందం ముగిసింది.

Jubilant FoodWorks Launches American Restaurant Chain Popeyes In India , Jubilant Foodworks Ltd., New Orleans - Style Fried Chicken, Chicken Sandwich, Shyam S. Bhartia, Hari S. Bhartia, David Shearer, Kentucky Fried Chicken - Telugu David Shearer, Hari Bhartia, Kentuckyfried, Orleansfried, Shyam Bhartia

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube