ఆ కంపెనీ ఉద్యోగులకి న్యూ ఇయర్ కు బంపర్ ఆఫర్..!

ఒకప్పుడు సొంతగా కారు కొనుక్కుంటే అమ్మో వాళ్ళకి కారు ఉందట అని విచిత్రంగా చెప్పుకునేవాళ్ళు.కానీ ఇప్పుడు సొంత కారును చాలామంది కొనుకుంటున్నారు.

 Jsw Company New Ev Policy 3 Lakh Incentives For Employees Details, Company, Good-TeluguStop.com

కారు కూడా నిత్యావసర స్థాయికి వచ్చేసింది.అలాగే ఈ కరోనా సమయంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్ లో ప్రయాణం చేయడం కంటే సొంతంగా కారు కొనుక్కుని అందులో ప్రయాణించడమే మేలు అని అనుకునే వారు చాలామందినే ఉన్నారు.

ఈ నేపథ్యంలో సొంత వాహనాల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.అయితే సొంత వాహనాలు కొనాలని భావించేవారిలో ఎక్కువ మంది టూ వీలర్ కన్నా కారును కొనేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి తిరగవచ్చు కదా అని ఆలోచిస్తున్నారు.ఆలోచన అయితే బాగానే ఉంది కాని పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు చూసి షాక్ అవుతున్నారు.

అందుకే దానికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కారును ఎంపిక చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే తమ ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుకగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు తమ కంపనీలోని ఉద్యోగులకు మూడు లక్షల ప్రోత్సాహకాన్ని అందిస్తుంది JSW గ్రూప్.

ఈ కంపనీ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న తమ కంపెనీ ఉద్యోగుల కోసం సరికొత్త గ్రీన్ ఇనిషియేటివ్ JSW ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని పరిచయం చేస్తున్నట్లు తెలిపింది.ఈ JSW గ్రూప్ ప్రకటించిన EV పాలసీ ప్రకారం ఉద్యోగులు టూ లేదా ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయవచ్చు.

Telugu Bumper, Company, Employees, Jswchairman, Jsw Company, Ev Policy, Latest-L

అంతేకాకుండా అన్ని JSW కార్యాలయాలు , ప్లాంట్లలో కంపెనీ ఉద్యోగుల కోసం ఉచిత ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలను వాడడాన్ని ప్రోత్సహించడమే తమ కంపెనీ లక్ష్యమని తెలిపింది.ఈ నేపథ్యంలో JSW గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ – JSW గ్రూప్ , కొత్త EV విధానంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.జనవరి 1 నుంచి తమ కొత్త పాలసీని అమల్లోకి తేనున్నట్లు ప్రకటించారు.

ముందుగా తమ కంపనీలో పనిచేసే ఉద్యోగులు ఈ వాహనాలను కనుగోలు చేస్తే తద్వారా పబ్లిసిటీ పెరిగి అందరూ కూడా మా ఈ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తారని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube