బాలయ్య ‘ఎన్టీఆర్‌’లో జూనియర్‌ కనిపించకుండా వినిపించనున్నాడట!  

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. తన తండ్రి పాత్రను బాలయ్య పోషిస్తున్నాడు. ఎన్టీఆర్‌ సినీ జీవితాన్ని మరియు రాజకీయ జీవితాన్ని రెండు పార్ట్‌లుగా విడదీసి ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ మరియు ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ గా విడుదల చేయబోతున్నాడు. ఈ రెండు పార్ట్‌లలో కూడా ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర మొత్తాన్ని చూపించేందుకు సిద్దం అవుతున్నారు. ఇక ఎన్టీఆర్‌ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఉంటే బాగుంటుందనే అబిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

JR NTR's Voice Over For Balakrishna's NTR Biopic-

JR NTR's Voice Over For Balakrishna's NTR Biopic

ఈమద్య ఎన్టీఆర్‌, బాలకృష్ణల మద్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. తాజాగా అరవింద సమేత సక్సెస్‌ వేడుకలో పాల్గొన్న బాలకృష్ణ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చాడు. ప్రస్తుతం సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ నేపథ్యంలో బాలకృష్ణ పాత్రను ఎన్టీఆర్‌ పోషించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. హరికృష్ణ పాత్రను కళ్యాణ్‌ రామ్‌, బాలయ్య పాత్రను ఎన్టీఆర్‌ పోషిస్తే ఇక సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం అంటూ అంతా భావించారు. అయితే ఎన్టీఆర్‌ చిత్రంలో బాలయ్య పాత్రను ఇప్పటికే మోక్షజ్ఞతో చేయించాలని ఫిక్స్‌ అయ్యారు. అందుకే ఎన్టీఆర్‌ను ఈ చిత్రంలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది.

JR NTR's Voice Over For Balakrishna's NTR Biopic-

ఎలాగైనా తాత సినిమాలో ఎన్టీఆర్‌కు ఛాన్స్‌ కల్పించాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో వాయిస్‌ ఓవర్‌ చెప్పించాలని నిర్ణయించుకున్నడట. అందుకు బాలకృష్ణ కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. కథను పరిచయం చేయడంతో పాటు, సంఘటనలను ఇతివృత్తంను ఎన్టీఆర్‌తో వినిపించబోతున్నారట. ఇది తప్పకుండా సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. వచ్చే జనవరిలో ఎన్టీఆర్‌ రెండు పార్ట్‌లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.