‘అరవింద సమేత’ ఏ ఏరియాలో ఎంతకు అమ్ముడు పోయిందో తెలుసా?  

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబో మూవీ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. కనుక చిత్రం అద్బుతంగా ఉంటుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతుంది. త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని చాలా కసితో తీసి ఉంటాడు అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. దాంతో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ దుమ్ము లేచి పోయింది. అద్బుతమైన ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తో ఈ చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే టాప్‌ గా నిలిచింది.

Jr NTR's Aravinda Sametha Movie Pre Business-

Jr NTR's Aravinda Sametha Movie Pre Business

ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు ఏ చిత్రం కూడా సాధించని ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ సాధించడంతో నందమూరి అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారానే 92 కోట్లను దక్కించుకున్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక శాటిలైట్‌ రైట్స్‌, ప్రైమ్‌ రైట్స్‌, ఆడియో రైట్స్‌, డబ్బింగ్‌ రైట్స్‌ ఇలా ఇతర రైట్స్‌ను కలుపుకుంటే మరో 25 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అరవింద సమేత ఎన్టీఆర్‌ కెరీర్‌లో నిలిచిపోయింది. ఇక కలెక్షన్స్‌ పరంగా ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

Jr NTR's Aravinda Sametha Movie Pre Business-

ఏరియాల వారిగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ :
నైజాం : 19 కోట్లు
సీడెడ్‌ : 15 కోట్లు
వైజాగ్‌ : 9.2 కోట్లు
ఈస్ట్‌ : 6 కోట్లు
వెస్ట్‌ : 4.8 కోట్లు
గుంటూరు : 7.2 కోట్లు
కృష్ణ : 5.5 కోట్లు
నెల్లూరు :3.3 కోట్లు
కర్ణాటక : 8.2 కోట్లు
ఓవర్సీస్‌ : 12.5 కోట్లు
ఇతరం : 1.3 కోట్లు
మొత్తం : 92 కోట్లు