ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా జూనియర్ ఎన్టీఆర్? జగన్ మరో సంచలనం  

Jr Ntr Will Be Brand Ambassador To Andhra Pradesh Tourism-

ఏపీ రాజకీయాలలో ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.జగన్ రాజకీయ ఆలోచన ఓ విధంగా ఉంటే చంద్రబాబు పార్టీ తెలుగు దేశం పార్టీని ఎలా కపాడుకోవాలా అనే ఆలోచనలో ఉన్నారు.

Jr Ntr Will Be Brand Ambassador To Andhra Pradesh Tourism--Jr NTR Will Be Brand Ambassador To Andhra Pradesh Tourism-

ఇక బీజేపీ పార్టీ ఏపీలో ఉన్న పొలిటికల్ స్పేస్ లోకి తాము ఎలా ప్రవేశించాలి, ఏపీలో రానున్న రోజులలో ఎలా కీలకంగా మారాలి అని ఆలోచిస్తుంది.ఇక జనసేన పార్టీ అయితే రానున్న 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి.అధికారానికి ఎలా దగ్గర కావాలి అనే ఆలోచన చేస్తుంది.ఎలా అన్ని పార్టీలు ఎవరికీ వారు విభిన్న ఆలోచనలతో రాజకీయాలలో ప్రయాణం చేస్తున్నారు.

Jr Ntr Will Be Brand Ambassador To Andhra Pradesh Tourism--Jr NTR Will Be Brand Ambassador To Andhra Pradesh Tourism-

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా టీడీపీ బాద్యతలు జూనియర్ ఎన్టీఆర్ కి అప్పగించాలని డిమాండ్ వినిపిస్తుంది.అయితే దీనికి చంద్రబాబు మాత్రం సుముఖంగా లేరని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో తాజాగా ఏపీ రాజకీయాలలో మరో ఆసక్తికరమైన వార్త సంచలనంగా మారింది.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ జూనియర్ ఎన్టీఆర్ ని ఏపీ ప్రభుత్వ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడానికి సిద్ధం అవుతున్నారనేది ఈ వార్త సారాంశం.ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న కొడాలి నాని, తారక్ ప్రాణ స్నేహితులు అనే విషయం అందరికి తెలిసిందే.

ఈ నేపధ్యంలో కొడాలి నాని చెప్పడంతోనే జగన్ జూనియర్ ఎన్టీఅర్ గురించి ఆలోచిస్తున్నట్లు సమాచారం.అతనిని టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలనే జగన్ ఆలోచన వెనుక కొడాలి నాని ఉన్నాడని జోరుగా వినిపిస్తుంది.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.