సోషల్ మీడియాలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ సతీమణి.. లవ్లీ భర్త అంటూ ట్వీట్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సతీమణులు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు.ఈ క్రమంలోనే రామ్ చరణ్ భార్య ఉపాసన, అల్లుఅర్జున్ సతీమణి స్నేహ రెడ్డి, మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వారి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను పలు సామాజిక అంశాలపై స్పందిస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు.

 Jr Ntr Wife Lakshmi Pranathi Opens Her Official Twitter Account, Jr Ntr, Lakshmi-TeluguStop.com

అయితే ఈ జాబితాలో ఇప్పటివరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లేదు.ఈమె పూర్తిగా తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ కుటుంబ బాధ్యతలలో నిమగ్నమయ్యారు.

ఇలా పెళ్లి తర్వాత కేవలం ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్లకు హాజరైన లక్ష్మీప్రణతి అనంతరం పిల్లలకు తల్లిగా మారి పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు.అయితే తాజాగా ఈమె కూడా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టింది.

ఈ క్రమంలోనే లక్ష్మీప్రణతి ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేయడంతో ఎంతోమంది అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఈమె ట్విటర్ ఖాతా ఓపెన్ చేయడంతోనే అతి తక్కువ సమయంలోనే వేలసంఖ్యలో ఫాలోవర్స్ పెరిగిపోయారు.ఈ సందర్భంగా లక్ష్మీప్రణతి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.మీ అందరితో కలిసి ట్విట్టర్ లో జాయిన్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది.

నా మొదటి ట్వీట్ నా లవ్లీ భర్తతో పోస్ట్ చేస్తున్నాను అంటూ ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ అతనికి ట్యాగ్ చేసింది.ఈ క్రమంలోనే లక్ష్మీప్రణతి చేసిన ఈ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఎంతో మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube