టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈ రోజు జరుపుకో నున్నారు.ఈ క్రమంలోనే ఈయన కొత్త సినిమాల అప్డేట్ లు వరుసగా రావడానికి రెడీగా ఉన్నాయి.
ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్.ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.
ఈ రోజు బర్త్ డే జరుపు కుంటున్న నేపథ్యంలో NTR30 నుండి బిగ్ అప్డేట్ ఇప్పటికే మేకర్స్ ఇచ్చేసారు.
నిన్న సాయంత్రం ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా ఈ చిన్న వీడియోకు నెట్టింట భారీ స్పందన లభించింది.ఈ మోషన్ పోస్టర్ లో ఎన్టీఆర్ చెప్పిన మాస్ డైలాగ్ కు ఆయన వాయిస్ కు గూస్ బంప్స్ వచ్చాయి.
మరి ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీగా ఉంది.
ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు అనే విషయం ఇప్పటికే బయటకు వచ్చింది.
ఈ విషయం గురించి వీరిద్దరూ కూడా కన్ఫర్మ్ చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఏ నేపథ్యంలోనే ఈ రోజు తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ 31 సినిమా నుండి ఒక కీలక అప్డేట్ తెలుపుతామని గెట్ రెడీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఈ రోజు మధ్యాహ్నం 12.06 గంటలకు ఎన్టీఆర్ 31 పేరుతొ తారక్ చేయబోయే నెక్స్ట్ గురించి మేకర్స్ కన్ఫర్మ చేయనున్నారు.యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించ నున్నారు.ఈ సినిమా కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా నిర్మాతగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మరి మధ్యాహ్నం కోసం అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.