ఎన్టీఆర్‌ 'లవకుశ'లు అదిరిపోయారు.. ఇద్దరు అప్‌కమింగ్‌ హీరోస్‌  

Jr Ntr Two Sun\'s-

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజాగా తన ఇద్దరు కొడుకుల ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు.గతంలో చాలా సార్లు ఎన్టీఆర్‌ పెద్ద కొడుకు అభయ్‌ రామ్‌ను సోషల్‌ మీడియాలో చూశాం.

Jr Ntr Two Sun\'s--Jr NTR Two Sun's-

కాని మొదటి సారి చిన్న కొడుకు భార్గవ్‌ రామ్‌ను చూపడంతో నందమూరి అభిమానులు ఆనందంతో ఫిదా అవుతున్నారు.ఇద్దరు కూడా అద్బుతంగా క్యూట్‌గా ఉన్నారంటూ నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా అంతా కూడా కామెంట్స్‌ చేస్తున్నారు.

Jr Ntr Two Sun\'s--Jr NTR Two Sun's-

నందమూరి అందగాళ్లు, రాబోయే తరంలో కాబోయే హీరోలు అంటూ ఇప్పటి నుండే నందమూరి ఫ్యాన్స్‌ చెబుతున్నారు.ఇద్దరు కూడా ఎన్టీఆర్‌ మాదిరిగా బొద్దుగా ముద్దుగా ఉన్నారు.ముఖ్యంగా చిన్న టైగర్‌ భార్గవ్‌ రామ్‌ హెయిర్‌ స్టైల్‌ అదిరిందంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.భార్గవ్‌ రామ్‌ మొదటి బర్త్‌డే సందర్బంగా ఈ ఫొటోలను ఎన్టీఆర్‌ అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు.

అప్పుడే ఎడాది అయ్యిందంటూ ఫ్యాన్స్‌ మురిసి పోతున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో పాటు రామ్‌ చరణ్‌ కూడా నటిస్తున్నాడు.ఆలియా భట్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నిత్యామీనన్‌ కూడా కనిపించబోతుందట.

భారీ అంచనాలున్న ఈ చిత్రంను వచ్చే ఏడాది జులైలో విడుదల చేయబోతున్నారు.ఈ చిత్రంతో ఎన్టీఆర్‌ స్థాయి మరింత పెరగడం ఖాయం అంటూ నందమూరి ఫ్యాన్స్‌ అంటున్నారు.