జూ.ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ ని రాజీవ్ కనకాల ఆ పేరుతో ఫీడ్ చేసుకున్నాడట…  

Jr Ntr Tollywood Rajeev Kanakala - Telugu Friendship, Jr Ntr, Rajeev Kanakala, Telugu Actor, Tollywood Young Tiger

టాలీవుడ్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల మధ్య ఉన్నటువంటి స్నేహ బంధం గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.కాగా రాజీవ్ కనకాల దాదాపుగా జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి ప్రతీ సినిమాలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో  నటించాడు.

 Jr Ntr Tollywood Rajeev Kanakala

అయితే తాజాగా వీరిద్దరి గురించి ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది.

అయితే ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్ తాను నటించినటువంటి  ఓ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

జూ.ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ ని రాజీవ్ కనకాల ఆ పేరుతో ఫీడ్ చేసుకున్నాడట…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఇదే ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రాజీవ్ కనకాల కూడా పాల్గొన్నాడు.ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ రాజీవ్ కనకాల గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులకు తెలిపాడు.

అయితే ఇందులో రాజీవ్ కనకాల జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ ని కిడ్ (చిన్న పిల్లవాడు) అని తన ఫోన్లో ఫీడ్ చేసుకున్నాడని, అంతేగాక ప్రతి సంవత్సరం చిల్డ్రన్స్ దినోత్సవం రోజున శుభాకాంక్షలు కూడా తెలుపుతూ సందేశాలు పంపిస్తూ ఉంటాడని తెలిపాడు.

ఈ సందేశాలు ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పంపిస్తున్నాడని, తనకి ఇప్పుడు పిల్లలు ఉన్నారని, కానీ రాజీవ్ కనకాల మాత్రం తనని ఇంకా చిన్న పిల్లాడే అనుకుంటున్నాడని సరదాగా చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ మరియు రాజీవ్ కనకాల సంబంధించినటువంటి ఈ వీడియో సోషల్ మీడియా  మాధ్యమం అయినటువంటి టిక్ టాక్ లో బాగానే వైరల్ అవుతుంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రాజీవ్ కనకాల పలువురు టాలీవుడ్ హీరోల చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ కూడా టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు