ఎన్.టీ.ఆర్ పై వస్తున్న ఆ పుకారు నిజమేనా..? ఆర్.ఆర్.ఆర్. లాంచ్ వేడుకలో బయటపడిన విషయం ఇదే.!  

  • ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన ‘బాహుబలి’ తర్వాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే సినిమా అంటే ఎక్సపెక్టేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియంది కాదు. అందుకు తగినట్టుగానే ‘RRR’ (వర్కింగ్‌ టైటిల్‌) అంటూ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో రాజమౌళి ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు.నవంబరు 11న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభాస్‌ , చిరంజీవి ముఖ్య అతిథిలుగా వచ్చారు.

  • Jr NTR To Play Villain Role In Rajamouli's RRR Movie-

    Jr NTR To Play Villain Role In Rajamouli's RRR Movie

  • ఈ వేడుకలో రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ గెటప్ లోనే కనిపిస్తుండగా ఎన్టీఆర్ మాత్రం సరికొత్త లుక్ తో దర్శనమిచ్చాడు. ఓపెనింగ్ లో అతడిని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.‘అరవింద సమేత’ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కాస్త స్లిమ్ గా కనిపించిన తారక్ ఈరోజు సినిమా ఓపెనింగ్ లో మాత్రం భారీ ఆకారంతో కనిపించాడు. అతడి ముఖం కూడా ఉబ్బినట్లుగా కనిపించింది. ఇక శరీరాకృతిలో చాలానే తేడా కనిపిస్తుంది.

  • Jr NTR To Play Villain Role In Rajamouli's RRR Movie-
  • ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన ఫిజిక్ ని మార్చుకోవడానికి వర్కవుట్లు మొదలుపెట్టి కొద్దిరోజులే అవుతున్నా ఇప్పటికే చాలా మార్పు కనిపిస్తోంది. పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయిన తరువాత అభిమానులు ఆశ్చర్యపోవడం ఖాయమని అంటున్నారు.

  • Jr NTR To Play Villain Role In Rajamouli's RRR Movie-
  • ఎన్టీఆర్ గెటప్ చూస్తుంటే నిజంగానే అతడు ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. లేక ముందు నుండి ప్రచారం జరుగుతున్నట్లుగా బాక్సర్ గెటప్ కోసం తన ఫిజిక్ ని మార్చుకుంటున్నాడా? అనేది తెలియాల్సివుంది!