మరోసారి ఎన్టీఆర్‌ని రిజెక్ట్ చేసిన తారక్

ఇటీవల అన్ని భాషల సినిమాల్లో బయోపిక్‌ చిత్రాల హవా పెరిగింది.ఇప్పటికే పలువురు ప్రముఖుల సినిమాలు తెరకెక్కించారు దర్శకనిర్మాతలు.

 Jr Ntr To Play Sr Ntr Role In Jayalalitha Biopic-TeluguStop.com

కాగా తాజాగా తమిళనాడు దివంగత సీఎం జయలలిత జీవితగాధను బయోపిక్ రూపంలో తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు.

జయలలిత బయోపిక్ చిత్రంలో ముఖ్య పాత్రలో బాలీవుడ్ భామ కంగనా రనౌత్ నటిస్తోంది.

కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్‌ను నటింపజేయాలని ప్రయత్నిస్తున్నారు చిత్ర యూనిట్.కానీ తన తాత పాత్రలో తానెప్పటికీ నటించనని ఇప్పటికే తారక్ పలుమార్లు చెప్పుకొచ్చాడు.

తాజాగా జయలలిత బయోపిక్ దర్శకనిర్మాతలు కూడా తారక్‌ను ఇదే విషయంపై సంప్రదించగా, తారక్ ససేమిరా అన్నాడట.

ఏదేమైనా నందమూరి తారక రామారావు పాత్రలో జూ ఎన్టీఆర్‌ని చూడాలన్న నందమూరి అభిమానుల కలను కలగానే మిగిల్చాడు తారక్.

మరి ఈ పాత్రలో ఎవరు నటిస్తారనే అంశం మాత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube